భీమిలి నియోజ
కవర్గం ప్రజాబలం న్యూస్ - జీవీఎంసీ జోన్-2లో 5,7వార్డుల పరిధి మధురవాడ,స్వతంత్రనగర్ లో కొలువైఉన్న శ్రీ లక్ష్మీ దేవి అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ముగిసాయి ఆదివారం,ఈసందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నసంతర్పణ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు,టిడిపి జిల్లా నాయకులు పిల్లావెంకట్రావు, టిడిపి పార్లమెంటరీ యువత కార్యదర్శి గరేగురునాధ్ (కె.వి.ఆర్.),జనసేన నాయకులు నక్కాశ్రీధర్, శ్రీకనకదుర్గ క్యాటరింగ్& ఈవెంట్స్ అధినేత కోర్రాయి సురేష్ పాల్గొని వారి చేతుల మీదుగా అన్నసంతర్పణ ను ప్రారంభించారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ... సామాజిక,ఆధ్యాత్మిక,సేవా కార్యక్రమాల్లో యువత అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు.ముఖ్యంగా యువతకు తమ కాలనీల అభివృద్ధికి తోడ్పడాలని, సామాజిక సత్ప్రవర్తనతో.. మెలగాలని స్థానిక యువతను కోరారు. సుమారు3500 మందికి అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షు, కార్యదర్శులు వాసపల్లి బండియ్య,బాలుపాత్రో తెలిపారు.ప్రతిఏడాదిలాగే ఈసంవత్సరం అన్నప్రసాదాన్ని అందించటం జరిగిందని,ఇంతటి మహత్తర కార్యానికి హాజరైన అతిథులకు వారి కుటుంబ సభ్యులకు ఆ లక్ష్మీదేవి అమ్మవారి ఆశీస్సులు నిత్యం ఉండాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో ఆలయ కోశాధికారి కొత్తాల శ్రీను,ఆర్గనైజింగ్ సెక్రటరీ దిబ్బశ్రీను,ఉప కోశాధికారి దాదిగౌరీశంకర్,అనుపోజు నాగరాజు,బావిశెట్టి జగన్,...కరకాని ఈశ్వరరావు, జోగేశ్వరపాత్రో,సునీల్ పోలిమాటి,తదితరులు పాల్గొన్నారు.