చంద్రంపాలెం లో ఘనంగా మరిడమ్మ పండగ.

 భీమిలి నియోజకవర్గం మధురవాడ (ప్రజాబలం న్యూస్ )

 బంగారమ్మ మరిడి ఉత్సవం ఆ


దివారం సాయంత్రం ఘనంగా జరిగింది. దేవర తేవడం, ఘటాలతో ఊరేగింపు జరిగింది. పాత మధుర వాడ నుంచి ప్రారంభమైన ఈ ఊరేగింపు చంద్రంపాలెం చేరి అక్కడినుండి శిల్పారామం జాతరలో వెలసిన మరిడమ్మ అమ్మవారికి నైవేద్యంతో పాటు పసుపు కుంకాలు సమర్పించారు. ఈ సందర్భంగా చంద్రంపాలెం మహిళలు ఇటీవల నేర్చుకున్న కోలాటం అందరిని ఆకర్షించింది. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి మొక్కులు తీర్చుకున్నారు. పాత మధురవాడ, చంద్రంపాలెం కు చెందిన భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

 .


.