డాక్టర్ మణి భూషణ్ కు ప్రజా హిత బ్రహ్మకుమారీస్ " ది లెజెండ్ డైరెక్టర్ " అవార్డు.
భీమిలి నియోజకవర్గం-- మధురవాడ విశాఖ నగరానికి చెందిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ విశాఖ ట్రావెల్ అండ్ టూరిజం ఫౌండేషన్, డిజిటల్ వీడియోస్, నిర్వహణ లో టీవీ టూరిజం ద్వార ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్న చిత్రాలను నిర్మిస్త్తున్న సంస్థ అధినేత ప్రముఖ దర్శకుడు జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ మణి భూషణ్ కు డైరెక్టర్స్ డే సందర్బంగా ప్రపంచం లో అత్యున్నత రాజయోగ సేవలు అందిస్తున్న ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తరుపున జరిగిన వేడుకల్లో భాగంగా,గౌరవ అతిధి శ్రీ వి ఈశ్వరయ్య రిటైర్డ్ హై కోర్ట్ చీఫ్ జస్టిస్రా, రాజయోగిని శివలీల, రామేశ్వరి అక్కయ్య సమక్షం లో వందలాదిమంది బ్రహ్మకుమారి, కుమారుల మధ్య స్థానిక గాజువాక సెంటర్ లో ఘనంగా నిర్వహించారు . ఈ సందర్బంగా ముఖ్య అతిధుల చేతులమీదుగా దర్శకుడు డాక్టర్ మణి భూషణ్ , ఎడిటర్ నీరజభూషణ్ దంపతులకు " ది లెజెండ్ డైరెక్టర్ " అవార్డు తో ఘనంగా సన్మానించారు. ఈసందర్బంగా జరిగిన సభలో డైరెక్టర్ మణి భూషణ్ మాట్లాడుతూ ప్రతి మనిషి జీవితం లో తాను నేర్చుకున్నది , సంపాందించినది , సాధించినది అన్ని కూడా సమాజ హితానికి ఉపయోగించిననాడే జన్మ సార్ధకత అవుతుంది . మనిషి మహానుభావుడిగా మారాలంటే ఉత్తమైన మార్గం సేవ , మానవత్వం , ప్రేమ. ఎవరైతే ప్రేమను పంచుతారో వారు సమాజం పట్ల భాద్యతనెరిగి ప్రవర్తిస్తారు, వారే చిరస్థాయిగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదిస్తారు. అలాంటి ఎన్నో అజరామరమైన సేవలు అందిస్తూ, ప్రపంచం లో ఆధ్యాత్మిక శోభను నలుదిశలా వ్యాప్తి చేసేందుకు కృషి చేస్తున్న, మహిళల చే నిర్వహించబడుతున్న ప్రముఖ సంస్థ ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం మౌంట్ అబూ వారు నా జీవితప్రయాణం లో గత 25 సంవత్సరాలుగా చేస్తున్న విభిన్న సేవలను , పొందిన రాష్ట్ర ప్రభుత్వ , జాతీయస్థాయి , జిల్లా స్థాయి అవార్డులను గుర్తించి , ఎన్నో లఘు చిత్రాల ద్వార ప్రజలకు సమాజాన్ని పరిచయం చేస్తూ , దార్శనికుడిలా పనిచేసే అవకాశం ఇచ్చిన, విశాఖ ప్రజల ఆశ్శీసులు మరియు ప్రపంచ పర్యాటకుల ద్వార పొందిన మన్ననలను గౌరవించి, మరింత గురుతర భాద్యతను సమాజం పట్ల పెంచేలా చేసిన " ది లెజెండ్ డైరెక్టర్ " ఆవార్డు ఎంతో మానిసిక ధైర్యాన్ని , నమ్మకాన్ని , ఆనందాన్ని పంచింది అని, ప్రతిఒక్కరు సమాజం ఒకకుటుంభం గా భావిస్తే అంతా సంతోషమయం అని పేర్కొన్నారుమనీ భూషణ్.
అవుతుందని అలాంటి వసుదైక కుటుంబం బ్రహ్మకుమారీస్ సంస్థ అని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా జస్టిస్ ఈశ్వరయ్య గారికి , శివలీల , రామేశ్వరి అక్కయ్యలకు కృతజ్ఞతలు తెలిపారు .
ఈ కార్యక్రమం లో సీఈఓ సీతారామ స్వామి , హీరో ఆదిత్యభూషణ్ తదితరులు పాల్గొన్నారు.