సీఎం జగనన్నతోనే సామాజిక న్యాయం -- భీమిలిఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్

 సామాజిక న్యాయం ముఖ్యమంత్రి జగనన్నతోనే సాధ్యం --- మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్.



భీమిలి నియోజకవర్గం - రాజీవ్ గృహకల్పకోలనీ 03 - సచివాలయం (21086055) - 22-05-2023 - సోమ వారం


రెండ రోజు గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమం లో మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు.


 ఈపర్యటన లో బాగంగా అవంతి RGK కోలనీ 03 లో (4 క్లస్టర్) 232 ఇళ్ళు గడప గడపకు వెళ్ళి ప్రజలు కు ఈ నాలుగు ఏళ్ళలో వైసిపి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు అమలు పాలన పై ప్రజలు కు వివరించి వారి నుండి ప్రజా సమస్యల అడిగి తెలుసుకున్నారు.


జగన్ మోహన్ రెడ్డి పరిపాలన పై ప్రజలు అబిప్రాయం అడగగా వాలంటీర్లు సచివాలయం సిబ్బంది ద్వారా లంచం లేకుండా నేరుగా పథకాలు అందించడం, ప్రభుత్వ అధికారులు మా వద్దకే రావడం చాలా బాగుందని మరల ముఖ్యమంత్రి గా జగన్ నియోజకవర్గం లో యంయల్ఏ గా మీరే రావాలని సంతోషం తో వారి అభిప్రాయం చెప్పారని పేర్కొన్నారు.


దుర్గా నగర్ - మిథిలాపురి కాలనీలోని, ఖారవేలి హౌసింగ్ సొసైటీ అపార్ట్మెంట్లో ఆ చుట్టుపక్కల ఏరియాలో వారిని పిలిపించి సచివాలయాలు పనితీరును, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వారి దృష్టికి తీసుకెళ్లి వారికి అందుతున్న పథకాలు తెలియజేశారు. స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడగగా 


 హైవే ట్రాఫిక్ ఉండటం వలన ఏ క్షణం ఏమవుతుందో తెలియని పరిస్థితి స్పీడ్ బ్యాకర్స్ నిర్మించాలని, హై ఓల్టేజితో విద్యుథ్ సరఫరా కి అంతరాయం గా ఉంటుంది సమస్యను శాశ్వత పరిష్కారం చేయాలని,


సమస్యలు విన్న త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులు కు అవంతి ఆదేశాలు జారీ చేశారు.


ఈ కార్యక్రమంలో జోన్ టు కమిషనర్ కనకమహాలక్ష్మి,, 7వ వార్డ్ వైసీపీ అధ్యక్షుడు పోతిన శ్రీనివాసరావు, మహిళా నేత రజిని, సింహాచలం దేవస్థానం రాష్ట్రం బోర్డ్ డైరెక్టర్ పిల్ల కృష్ణమూర్తి పాత్రుడు, పిల్ల సూరిబాబు, పిల్ల అప్పన్న, లోహిత్, వైసీపీ యువనేత జగుపిల్లి నరేష్, కనకమాలక్ష్మి ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ వంకాయల మారుతి ప్రసాద్, మగ్గూరి వెంకట్రావు, వాండ్రాసి రవికుమార్,జీవియంసి వైసిపి శ్రేణులు సచివాలయం కన్వినర్ లు గృహ సారథులు ప్రభుత్వ అధికారులు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.