పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ --- భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్.

 పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం జగన్ --మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్. 

 విశాఖపట్నం.

భీమిలి నియోజకవర్గం: మధురవాడ--- (ప్రజాబలం న్యూస్ ) - లక్ష్మివానిపాలెం సచివాలయం పరిధిలోని 



మొదటిరోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో భాగంగామాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు 

 శంబువానిపాలెం - B2 కోలనీ లో 378 ఇళ్ళు గడప గడపకు వెళ్ళి ప్రజలు కు ఈ నాలుగు ఏళ్ళలో వైసిపి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు బ్రోచర్లు ఇచ్చి వారికి వెన్ను తట్టిగుర్తు చేశారు.


జగన్ మోహన్ రెడ్డి పరిపాలన పై ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. వాలంటీర్లు సచివాలయం సిబ్బంది ద్వారా లంచం లేకుండా నేరుగా పథకాలు అందించడం, ప్రభుత్వ అధికారులు తమ వద్దకే వచ్చి సంక్షేమ పథకాలు అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మరల ముఖ్యమంత్రి గా జగన్ నియోజకవర్గం లో యంయల్ఏ గా మీరే రావాలని సంతోషం తో వారి అభిప్రాయంచెబుతున్నారని తెలిపారు.


శంబువానిపాలెం - B2 కోలనీలో దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడగగా అవంతి దృష్టిలో పెట్టిన దీర్ఘకాలిక సమస్యలు, వివరించారు.

 శంబువానిపాలెం లో డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేపట్టాలని,

 బిటి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని,

 సెల్ టవర్ నిర్మాణం చేపట్టాలని,


 B2 కోలనీ లో అంగన్వాడీ భవనం నిర్మాణం చేపట్టి స్టాఫ్ ను నియమించాలని,


రోడ్లు మరమ్మతులు చేపట్టాలని,పలు

 సమస్యలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులు కుఆదేశించారు.


ఈ కార్యక్రమంలో జీవియంసి వైసిపి శ్రేణులు సచివాలయం కన్వినర్ లు గృహ సారథులు ప్రభుత్వ అధికారులు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.