భీమిలి ఎమ్మెల్యే అవంతి ఆధ్వర్యంలో టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలు --- కేక్ కట్ చేసి పేదలకు చీరలు పంపిణీ చేసిన అవంతి శ్రీనివాస్

 అవంతి ఆద్వర్యం లో ఘనంగా టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలు


భీమిలి నియోజకవర్గం ---ప్రజాబలం న్యూస్ --- 



టిటిడి చైర్మన్ మూడు జిల్లాల కోఆర్డినేటర్ .వైవి సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలు భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలోసోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు.


 



అనంతరం సుబ్బారెడ్డి జన్మదినం సందర్భంగా మనలో మనం సంతోషంగా ఉండటం కంటే,పది మంది పేదలు కళ్ళలో సంతోషం నింపాలని అదే నిజమైన ఆనందం అని పేద మహిళలకు అవంతి చేతులు మీదగా చీరలు పంపిణీ చేశారు.


ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గం వైసిపి శ్రేణులు పాల్గొన్నారు.