భీమిలి నియోజకవర్గం మధురవాడ (ప్రజాబలం న్యూస్ )
మన్యంవిప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆదివారం చంద్రంపాలెం బాపూజీ కళా మందిరం వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి చంద్రంపాలెం జనసేన పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు, ఈ సందర్భంగా జనసైనికులు మాట్లాడుతూ బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించి భారతదేశానికి స్వాతంత్ర్య సాధనలో ప్రజలను ఐక్యం చేసి తెల్ల దొరలను వెంట తగిలిన అల్లూరి నేటి యువతకు ఆదర్శప్రాయుడని ఆయన అడుగుజాడల్లో దేశాభిమానం పెంచుకొని భారతదేశ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 7వ వార్డు జనసేన నాయకులు పిల్లా శ్రీనివాస్, సంకా బత్తుల సతీష్, జగ్గు పిల్లి నాని, సంక బత్తుల రమేష్, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.