భీమిలి నియోజకవర్గం మధురవాడ (ప్రజాబలం న్యూస్ ) జీవియంసి మదురవాడ జోన్ 2
ఏపీరాష్ట్ర ముఖ్యమంత్రి గా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తి అయిన సందర్భంగా మంగళవారం5-6-7 వార్డు ల వైసిపి శ్రేణుల ఆధ్వర్యంలో స్వాతంత్ర నగర్ లో మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేతులు మీదుగా కేకు కటింగ్ చేసి వైసిపి శ్రేణులు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అవంతి చేతులు మీదుగా పేద వృద్దులకు చీరలు పంపిణీ చేశారు.
అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించి ఎక్కడా అమలు చేయనటువంటి విదంగా మేనిఫేస్టో ను రూపొందించి దానిని ఒక భగవద్గీత ఒక బైబిల్ ఒక ఖురాన్ గా భావించి అందులో పొందుపరిచిన ప్రతీ అంశాన్ని కులం మతం ప్రాంతం పార్టీ లకు అతీతంగా ఎలాంటి వివక్ష చూపకుండా పైసా లంచం లేకుండా, సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇచ్చిన హామీలు 98 శాతం పై బడి సంపూర్ణంగా గడప గడపకు చేరేలా అమలు చేసారని, ఆయన పేదలు పక్షపాతిఅని, పేదలు, కళ్ళలో ఆనందం చూడటమే ఆయన లక్ష్యం అని పేర్కొన్నారు.ఒకవైపు సంక్షేమం మరో వైపు అభివృద్ధి రెండు కళ్ళు గా పని చేసిన దొంగ దేశంలో ఏకైక ముఖ్యమంత్రి జగననన్న అని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మొన్నటి వరుకూ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వలన ప్రజలు సోమరి పోతులు అవుతున్నారని, వాలంటీర్లు ఉద్యోగాలు సంచులు మోసే ఉద్యోగాలు అని హేళనగా మాట్లాడి నేడు తాను అధికారంలో వస్తే మరిన్ని సంక్షేమ పతాకాలు అమలు చేసి వాలంటీర్ వ్యవస్థ ను కొనసాగిస్తానని అనడం వైసిపి ప్రభుత్వం అందించే పాలనను కొనియాడి, గొప్పదని ఒప్పుకోవడం, వంటిదే అని గతంలో 650 హామీలతో మేనిఫెస్టో తయారు చేసి గెలిచాక దానిని తుంగలో తొక్కారని దానిని ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదని చెప్పారు. ఇపుడు మరో ముందడుగు వేసి ప్రజలకు మోసం చేసేందుకు మరొక అబద్దాల మేనిపోష్ట్ తెర తీశారని వీటిని మరలా ప్రజలు నమ్మే స్థితిలో లేరని,రాబోయే ఎన్నికల్లో మళ్ళీ బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని జగన్ సుపరిపాలన ప్రజలు మనసుల్లో నాటుకు పోయిందని చెప్పారు. మహిళలు ప్రజలు వైసిపి ప్రభుత్వం పాలన పై సంపూర్ణ నమ్మకంతో ఉన్నారని, ప్రజలకు అన్నం పెట్టేది ఎవరు సున్నం పెట్టేది ఎవరు అన్నది,ఈ నాలుగు ఏళ్ళలో బాగా తెలుసుకున్నారని దానికి నిదర్శనం గడప గడపకు మన ప్రభుత్వం,కార్యక్రమం లో మాకు వస్తున్న ఆదరణే నిదర్శనం అని రాబోయేది వైసిపి ప్రభుత్వం అని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో 5వ వార్డ్ వైసీపీ అధ్యక్షుడు పోతిన హనుమంతురావు, 7వ వార్డు వైసిపి అధ్యక్షుడు పోతిన శ్రీనివాసరావు, సింహాచలం దేవస్థానం డైరెక్టర్ పిల్ల కృష్ణమూర్తి పాత్రుడు, పిల్లా సూరిబాబు, కనహమా లక్ష్మీ దేవస్థానం డైరెక్టర్ వంకాయల మారుతి ప్రసాద్, మహిళా సీనియర్ నేత ఏడువ వార్డు వైసిపి మహిళా అధ్యక్షురాలు చేకూరి రజిని. సీనియర్ వైసీపీ నేత అల్లాడ లింగేశ్వరరావు జీవియంసి వార్డు వైసిపి శ్రేణులు సచివాలయం కన్వినర్ లు గృహ సారథులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.