నేరాల నియంత్రణకు ప్రతిష్ట చర్యలు --- నార్త్ సబ్ డివిజన్ ఏసిపి శివరాం రెడ్డి

 మధురవాడ (ప్రజాబలం న్యూస్ఆన్లైన్.) శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చట్టపరమైన చర్యలు తప్పవని విశాఖ నార్త్ సబ్ డివిజన్ ఏసీపీ ఎం. శివరాంరెడ్డిపేర్కొన్నారు. సోమవారం ఆయన ఇటీవల బదిలీపై వెళ్లిపోయిన నార్త్ ఏసిపి సిహెచ్ శ్రీనివాసరావు నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు. నేరాలు అదుపు చేసేందుకు తన సిబ్బంది సహకారంతో, ప్రజల సహకారంతో ప్రతిష్టాత్మకమైన, తగిన ప్రణాళికతో  చర్యలు తీసుకొని మరింత ముందుకు వెళ్తామన్నారు. నార్త్ సబ్ డివిజన్ పరిధిలో పీఎంపాలెం, పద్మనాభం, బీమిలి, ఆనందపురం లలో శాంతి భద్రతల అదుపు చేసేందుకు కృషి చేస్తామన్నారు. అందుకు ప్రజలు తగిన సహకారం అందించాలని పేర్కొన్నారు. రౌడీ షీటర్ల కానీ, మరి ఇంకెవరైనా భూకబ్జాలకు పాల్పడిన, శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.