భీమిలి నియో
జకవర్గం : మధురవాడ - (ప్రజాబలం న్యూస్) జీవీఎంసీ ఆరో వార్డు పరిధి రేవెల్ల పాలెం కు చెందిన పిల్లా శ్రీమన్నారాయణ, నిర్మల దంపతుల ఏకైక పుత్రుడు రుక్మేశ్ రాకేష్ పాత్రుడు వివాహం ఆయన స్వగృహంలో శుక్రవారం ఉదయం అంగరంగ వైభవంగా జరిగింది. యారాడకు చెందిన బంక పైడారావు, దేవీ దంపతుల ఏకైక కుమార్తె అనూష ను రాకేష్ వివాహం చేసుకున్నారు. వీరిని స్థానికంగా ఉన్న పలు రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. రాష్ట్ర నగరాల కార్పొరేషన్ చైర్మన్ పిల్లా సుజాత సత్యనారాయణ దంపతులతో పాటు, భీమిలి టిడిపి ఇన్చార్జ్ కోరాడ రాజబాబు, 7వ వార్డు కార్పొరేటర్ పిల్లా మంగమ్మ వెంకట్రావు, పోతిన బాలాజీ, మాజీ మధురవాడ క్వారీ సొసైటీ అధ్యక్షులు పిల్లా రాంబాబు తదితరులు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.