శిల్పారామం జాతరలో మొక్కలు నాటిన వాకర్స్ క్లబ్.

 జాతర


వాకర్స్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం భీమిలి నియోజకవర్గం --( ప్రజాబలం న్యూస్ )

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మధురవాడ శిల్పారామంలో జాతర వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పలు మొక్కలు నాటి పర్యావరణం పై తమకున్న ప్రేమను చాటుకున్నారు.

ఆరోగ్య రక్షణి స్వచ్ఛమైన వాయువు అని దానిని కాపాడుకోవాలంటే పచ్చని చెట్లు అవసరమని పలువురు వత్తులు

హితవు పలికారు. 

శిల్పారంలో నిత్యం వ్యాయామం చేసే మాకు ఇక్కడ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తప్పకుండా తమ వంతు సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.

వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఈ కార్యక్రమం తలపెట్టడం అభినందనీయమని, పర్యావరణ పరిరక్షణ ప్రతి వ్యక్తి బాధ్యతగా చేపట్టాలని శిల్పారామం పరిపాలనాధికారి విశ్వనాథరెడ్డి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జాతర వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, అధ్యక్షులు ప్రభాకర్ రాజు, నాయక్, భావిశెట్టి సత్యనారాయణ, బొడ్డేపల్లి చిరంజీవి, పోతిన అరవింద్

టైక్వాండో కోచ్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.