మధురవాడలో ఘనంగా మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే అవంతి జన్మదిన వేడుకలు

 భీమిలి


నియోజకవర్గం --మధురవాడ - (ప్రజాబలం న్యూస్)

 జీవీఎంసీ 7వ వార్డు పరిధి వాంబే కాలనీలో భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలుఆవార్డు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉచిత మెగావైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి రోగులకు అవంతి చేతుల మీదగా ఉచిత మందులు పంపిణీ చేశారు. . ముందుగా కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించుకున్నారు. అవంతి కి పూలమాలు వేసి, సాల్వాలు కప్పి ఘన సన్మానం చేశారు. అనంతరం మిథిలాపురి కాలనీ సన్ పవర్ మానసిక వికలాంగుల స్కూల్లో పిల్లలకు అన్నం దానం చేశారు. అలాగే ఆరువ వార్డులోని బక్కన్నపాలెం రోడ్డులో ఉన్న అమ్మఒడి స్కూల్లోఅన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నగరాలు కార్పొరేషన్ చైర్మన్ పిల్లా సుజాత సత్యనారాయణ, జోన్  2 కమిషనర్  కే. కనకమహాలక్ష్మి  5 వవార్డ్ వైసిపి అధ్యక్షుడు పోతిన హనుమంతరావు, ఆరు వ వార్డు వైసిపి అధ్యక్షుడు బొట్ట అప్పలరాజు, 7వ వార్డు వైసిపి అధ్యక్షుడు పోతిన శ్రీనివాసరావు, మహిళా అధ్యక్షురాలు రజిని, సింహాచలం దేవస్థానం డైరెక్టర్ ముదిండి రాజేశ్వరి, ఎంవి రమణమూర్తి, సీనియర్ వైసీపీ నేత అల్లా డ లింగేశ్వరరావు, మాజీ సర్పంచ్ కుడితి రామారావు, లోహిత్, ఆరివ వార్డు సీనియర్ వైసీపీ నేత గుంటుబోయిన సంజీవి యాదవ్,వరలక్ష్మి జగ్గు పిల్లి


నరేష్,,తదితరులు పాల్గొన్నారు.