భీమిలి నియోజకవర్గం
మధురవాడ-- ప్రజాబలం న్యూస్ --- భీమిలి నియోజకవర్గం మధురవాడ జోన్ టు లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతల్లో గ్రూపు రాజకీయాలు, వర్గ విభేదాలతో సతమతమవుతోంది. భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు సందర్భంగా గ్రూపు రాజకీయాలు బట్టబయలయ్యాయి. ప్రధానంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా సీనియర్ నేతగా పేరుపడ్డ ముందుండి రాజేశ్వరి కి సింహాచలం దేవస్థానం డైరెక్టర్ పదవి ఇచ్చినప్పటినుండి ఇక్కడ ఆమెపై వైసీపీ క్యాడర్ గుర్రుగా ఉంది. దీంతో ఈమె స్థానికంగా కాకుండా సిటీ పదవుల పేరుతో సిటీలోనే పనిచేస్తుంది. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తో పాటు, ఏయూ వైస్ ఛాన్స్లర్ అండ ఈమెకు ఉందని దీంతో ఆమె తన ఆధిపత్యంతో ముందుకు దూసుకుపోతుందనిపలువురు ఆ పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. పైకి అవంతిని పొగుడుతున్నప్పటికీ లో లోపల గుర్రుగా ఉన్నారని ఆ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన రజిని కష్టపడి పనిచేస్తున్నప్పటికీ ఆమెకు గుర్తింపు లేకుండా పోతుందని ఆమెకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆ కార్యకర్తల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 8వ వార్డులో బలమైన కాపు తెల్లగా, యాదవ సామాజిక వర్గం ఉన్నప్పటికీ సరైన మహిళా నేత లేకపోవడంతో ఆ వార్డ్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ రోజురోజుకు దిగజారి పోతుందని ఆయా సామాజిక వర్గాలలో అసంతృప్తి తో ఉన్నట్లు చేసే కార్యక్రమాలను బట్టి అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా సరైన మహిళా నేతలు లేకపోవడంతో సభలు సమావేశాలలో డ్వాక్రా మహిళలు, కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో జనాలు సరిగా రాకపోవడం ఆ పార్టీ శ్రేణుల్లోనే అసంతృప్తి చెందుతున్న విషయం సోమవారం వాంబే కాలనీలో జరిగిన మెడికల్ క్యాంపు లో జనాలు లేకపోవడంస్వయంగా మాజీ మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిఎంతో ప్రతిష్టాత్మగా తీసుకొనిమహిళా నేతలకుఅనేక విధాలుగా పెద్దపీట వేస్తున్నారు,జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా పోటీ చేసిఅతి తక్కువ మెజార్టీతో ఓడిపోయిన మహిళా నేతలు ఎక్కడ కనిపించడం లేదు. వారి భర్తలే హవా నడుపుతున్నారు తప్పప్రజల్లో ఎక్కడా కనిపించడం లేదు.ప్రజా సమస్యలను తెలుసుకొనివాటి పరిష్కారాన్ని కృషి చేయాల్సిన ఓటమి చెందిన మహిళా కార్పొరేటర్ అభ్యర్థులుజగనన్న ఆశయాలకు అనుగుణంగా పనిచేయడం లేదన్న విమర్శలు సర్వత్ర వెళ్ళు వెత్తుతున్నాయి. కార్పొరేషన్ ఎన్నికలు అయినప్పటి నుంచి వీరుఆ పార్టీని అంతగా పట్టించుకోలేదు. ఎన్నికల ముందు ఎంతో కష్టపడి పని చేసిన వీరు తమ వాక్చాతుర్యాన్ని కూడా పెంచుకున్నారు. మంచి మహిళలుగా కూడా పేరుపొందారు. అటువంటిదివారు ఓటమి చెందడంతో వారిలో నిరాశ చోటు చేసుకోవడంతో వారు తిరిగి వంటింటికే పరిమితం అయ్యారని పలువురు చెప్పుకుంటున్నారు. ఇ ప్పటికైనా పార్టీ అధిష్టానం వారిపై దృష్టి సారించి ఆ మహిళా నేతలు ముందుకు వచ్చి ఎన్నికల ముందు వారిని ఏ విధంగా ప్రోత్సహించారో అదేవిధంగా వారిని ప్రోత్సహించి ఆ జమీందారీ నేతలు వారిని తీర్చిదిద్దాలని ఆ పార్టీ శ్రేణులు,వారి అభిమానులు కోరుకుంటుకుంటున్నారు.ముఖ్యంగా ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ వారిపై దృష్టి సారించి వారు ప్రజల్లోకి వెళ్లే విధంగా చొరవ చూపాలని అప్పుడే డ్వాక్రా సంఘాలు మహిళలు ముందుకు వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ శ్రేణుల్లో అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే ఇక్కడ ఎంతోమంది వైసీపీ నేతలు కార్యకర్తలు ఎంత పని చేస్తున్న తమకు గుర్తింపు లభించడం లేదని వాపోతున్నారు.