ఘనంగా ముగిసిన చంద్రంపాలెం దుర్గాలమ్మ పెద్ద పండుగ ఉత్సవాలు

 అంగరంగ వైభ


వంగా చంద్రంపాలెం గ్రామ దేవత శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఉత్సవాలు, 

ఘనంగా ముగిసిన పెద్ద పండగ.

 మధురవాడ-- (ప్రజాబలం న్యూస్--) చంద్రంపాలెం గ్రామ దేవత చంద్రంపాలెం జాతర గట్టు పై కొలువైయున్న శ్రీ దుర్గాలమ్మ ఉత్సవాలు గత నెల 5వ తారీఖున ప్రారంభము అయి నిన్న రాత్రి 12 గంటల తో ఘనంగా ముగిశాయి, ముఖ్యంగా తేది 12/6/2023 సోమవారం తొలేళ్లు ఉత్సవం జరిపి ఆ రాత్రికి భాగవతం, పౌరాణిక ఘట్టములు రాష్ట్ర స్థాయి నటులచే ప్రదర్శించారు, తేది 13/6/2023 మంగళవారం ప్రధాన పండగ రోజు తెల్లవారు జామున చద్దన్నం దండి, ఉదయం జోగి దండి, నూకాలమ్మ పసుపు కుంకుమ సమర్పించి, అనంతరం ఉయ్యాల కంబాల ఎత్తి మధ్యాహ్నం 3:00గంటకు పాలధార తిరిగి , అనంతరం అమ్మవారి గటాలు గ్రామంలో తిరిగాయి , అనంతరం అమ్మవారి సంబరం ప్రారంభం ముందుగా అమ్మవారిని ఉయ్యాలలో పెట్టి ఊపడం అక్కడ నుండి సంబరం మేళ తాళాలు మంగళ వాయిద్యాలు, వివిధ నేల డాన్సులు పలుసాంస్కృతిక కార్యక్రమాలతో భారీ మందుగుండు సామగ్రి ఊరేగింపుగా బయలుదేరి గ్రామంలో అన్ని వీధులు తిరుగుతూ అమ్మవారి ఆలయానికి చేరుకొని అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి అనుపు కార్యక్రమం రాత్రి 12 గంటల సమయంలో ఘనంగా పూర్తిచేయడం జరిగింది,ఈ సందర్భంగా భారీ మందుగుండు సామగ్రి కార్చడం జరిగింది, ఈ సందర్భంగా ప్రముఖులు, వేల సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు, 


ఇంత ఘనంగా శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఉత్సవాలు జరగడానికి సహకరించిన భీమిలి శాసన సభ్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు కి, పోలీసు వారికి, జివియంసి అధికారులకు, మధురవాడ పుర ప్రజలకు, చంద్రంపాలెం గ్రామస్తులకు, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అతిథులు, బంధు మిత్రులకు చంద్రంపాలెం గ్రామ పెద్దలు, శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు,


చంద్రంపాలెం గ్రామస్తులు ఈ ఉత్సవాలకు ససకరించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పండగ ఉత్సవాలు సందర్భంగా ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు మంగళవారం ఉదయం దుర్గాలమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.