పేదల ప్రభుత్వానికి అండగా నిలవండి -- గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మాజీమంత్రి భీమిలి ఎమ్మెల్యే అవంతి.

 భీమిలి నియోజ


కవర్గం,మధురవాడ-- (ప్రజాబలం న్యూస్ ) జీవీఎంసీ 7 అవార్డు స్థానిక పిలకవానిపాలెం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు మాజీమంత్రి భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు శనివారం సాయంత్రం శంకుస్థాపన చేసి శిలా పలకం ఆవిష్కరణ చేశారు. 48 లక్షల రూపాయల జీఎంసీ నిధులతో పనులు ప్రారంభించారు. అనంతరం అదే గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల ఏ విధంగా అందుతున్నాయో ప్రజలు సంతృప్తి చెందుతున్నారా లేరా అని మహిళలను ఆరా తీశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని ఆయనకు అండగా ఉండవలసిన, సమయం ఆసన్నమైనదని, ఆ పథకాలన్నీరాబోయే రోజుల్లో అమలు కావాలంటేమళ్లీ జగన్ ప్రజలు ఆశీర్వదించాలని పేర్కొన్నారు. పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలుపరిచిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, గత ప్రభుత్వ పాలన, ప్రస్తుత ప్రభుత్వ పాలన బేరీజు వేసుకొని ఆలోచించి మనస్సాక్షిగా ఎవరు మేలు చేశారో వారికే అండగా ఉండాలని పిలుపునిచ్చారు. తాను మళ్ళీ ఇక్కడ నుండే పోటీ చేస్తున్నానని, ఎన్నికలు దగ్గర పడుతున్నాయని తనను ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని డైరెక్ట్ గా ప్రజలకు చెప్పేశారు. తమ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని పెత్తందారులకు పేదలకు జరిగిన ఈ యుద్ధమే రాబోయే ఎన్నికలనే దీన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని పేదల ప్రభుత్వానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జోన్ 2 కమిషనర్ కే కనకమహాలక్ష్మి భీమిలి వైసిపి ఇన్చార్జి ము త్తం శెట్టి మహేష్, 7వ వార్డు కార్పొరేటర్ పిల్ల మంగమ్మ వెంకట్రావు దంపతులు , 7వ వార్డు వైసిపి అధ్యక్షుడు పోతిన శ్రీనివాసరావు 7 వా వార్డ్ వైసీపీ మహిళా అధ్యక్షురాలు చేకూరి రజిని , ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నేతలు సింహాచలం దేవస్థానం డైరెక్టర్ పిల్ల కృష్ణమూర్తి పాత్రుడు, కనకమాలక్ష్మి దేవస్థానం బోర్డు డైరెక్టర్ వంకాయలు మారుతి ప్రసాద్, పిల్ల సూరిబాబు,అప్పన్న, పోతిన శేషుబాబు రాయిన సాయి, బంగారు రాజు, మగ్గూరి వెంకటరావు,ప్రసాద్,సచివాలయ కార్యదర్శిలు,వాలంటీర్లు, కన్వీనర్లు, గృహ సారథ లు తదితరులు పాల్గొన్నారు.