ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ -- మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్

 భీమిలి నియోజకవర్గం - ఆనందపురం మండలం (ప్రజాబలం న్యూస్ )



మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆనందపురం ప్రభుత్వఉన్నత పాఠశాల లో భీమిలి నియోజకవర్గం స్థాయి లో జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం శనివారం ఉదయం  చేపట్టడం జరిగింది.


 ఈ సందర్భంగాఅవంతి మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు ,నగదు పురస్కారాలు ఇచ్చెందుంకు గానూ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆణిముత్యాలు అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని దీనినే స్టేట్ బ్రిలియన్స్ అవార్డ్స్ గా పేరు పెట్టడం జరిగిందని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ పాఠశాలల చదువుకొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ను ప్రోత్సాహం అందిస్తే వారు ఇంకా బాగా చదివి ఉన్నత స్థాయికి వెళ్తారన్నది ముఖ్యమంత్రి ఆలోచన అని,విద్యే అత్యున్నత ఆయుధం, దానిని దృష్టిలో ఉంచుకొని వైసిపి ప్రభుత్వం జగనన్న, విద్య పైనే ప్రదానం గా దృష్టి సారించారని, వైసిపి ప్రభుత్వం విద్యపై చేసే ఖర్చును భవిష్యత్తు లో పెట్టుబడి గా పరిగణిస్తున్నందున, ప్రతీ కుటుంబం లో ఎంత మంది విద్యార్థులకైనా అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉందని అన్నారు.

 గత ప్రభుత్వాలు పాలనలో ప్రభుత్వ పాఠశాలలు విద్యా బోధన అంటేచాలా చిన్న చూపు ఉండేదని,ఇప్పుడు మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగనన్న నాడు నేడు ద్వారా విద్యా రంగంలో వినూత్న సంస్కరణలు చేసి,ఎన్నో పథకాలు అమలు చేసి ప్రభుత్వ పాఠశాలలు కార్పోరేట్ స్కూల్ కి దీటుగా, తయారు చేసారని ప్రభుత్వo పాఠశాలలో చదివిన విద్యార్థులు రాష్ట్రంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సొంతం చేసుకున్నారని సీట్లు కూడా దొరకని పరిస్తితి నెలకొనెలా చేసి పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం అనుసరించేలా, చేసిన దేశంలో ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని,ప్రభుత్వ పాఠశాలల ప్రతిభ గల ఉపాధ్యాయులు ఉన్నారని జగనన్న అందించే పథకాలు సద్వినియోగం చేసుకొని, ప్రతీ ఒక్కరు శ్రద్ద గా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.


అనంతరం భీమిలి నియోజకవర్గం స్థాయి లో టాప్ మూడు ర్యాంకులు సాధించిన వారికి మొదటి బహుమతి గా 15,000 రూ , ద్వితీయ బహుమతి గా 10,000 రూ ,తృతీయ బహుమతి గా 5,000 రూ భీమిలి నియోజకవర్గం లో 4 మండలాలు లో భీమిలి 63,ఆనందపురం 36, పద్మనాభం 27,చినగదిలి 24 మోత్తం కలిపి 150 మంది విద్యార్థులు ను శాలువాలతో సన్మానించి నగదు పురస్కారాలు తో పాటు సర్టిఫికెట్ లు అవంతి శ్రీనివాసరావు చేతులు మీదుగా అందజేశారు.



ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు - ఉపాద్యాయులు - నియోజకవర్గం వైసిపి శ్రేణులు - సచివాలయం కన్వినర్ లు గృహ సారథులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.