ప్రజా గాయకుడు పందిరి రాముకు ఘన సన్మానం ---- సాలువా వేసి. పూలమాలలు వేసిన మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే అవంతి.

 మధురవాడ----


(ప్రజాబలం న్యూస్ )- జీవీఎంసీ 7వ వార్డు స్వతంత్ర నగర్ వాటర్ ట్యాంక్ వద్ద ప్రహరి నిర్మాణం శంకుస్థాపన కు వచ్చిన భీమిలి నియోజకవర్గం మంత్రి అవంతి శ్రీనివాస్ నిపౌర సంక్షేమ సంఘం సభ్యులు కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో పౌర సంక్షేమ సంఘంఅధ్యక్షులు నాగోతి సూర్య ప్రకాష్ ఆధ్వర్యంలో పౌరసంక్షేమ సభ్యులందరూ కలిసి ఆయనకి వినతిపత్రం అందజేశారు. ఈ వినతి పత్రంలో గత కొన్ని రోజులుగా పౌర గ్రంథాలయం ఏర్పాటు చేయాలని అలాగే పౌర సంక్షేమ సంఘ నికే స్థలము కేటాయించాలని, మధురవాడ బ్రిడ్జి కిందన వర్షం వచ్చినప్పుడు ఆ బ్రిడ్జి కింద నీరు నిల్వ ఉండడం కారణంగా ప్రయాణికులు మోటార్ వెహికల్ వారు పాదచారులు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. ఆ కారణంగా నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని చెప్పి వినతిపత్రం ఇవ్వడంజరిగినది. అలాగే మధురవాడ హైస్కూల్ విద్యార్థులు రోడ్డు దాటేటప్పుడు ఇబ్బంది పడుతున్నారని ఫ్లైఓవర్ లేక అండర్ గ్రౌండ్ బ్రిడ్జి కట్టాలని అలాగే మధురవాడ స్వతంత్ర నగర్ లో ఉన్నటువంటి పార్కు నిర్మాణం పూర్తయినప్పటికీ అది ఓపెనింగ్ కాలేదు, అని చెప్పి అలాగే పార్కులో ఎక్కడైతే ఉన్నా అవన్నీ కూడా త్వరలో నిర్మాణం చేపట్టాలని చెప్పి తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా, పౌర సంక్షేమ సంఘ సభ్యులైన పంది రాము ప్రజా పాటల పందిరి పుష్క ఆవిష్కరణ భీమిలి నియోజవర్గ మంత్రివర్యులు అవంతి శ్రీనివాస్ చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పిల్ల మంగమ్మ,వెంకటరావు దంపతులు, అలాగే వైసిపి నాయకులు శ్రీనివాస్, చేతుల మీదగా ఆవిష్కరించి పౌర సంక్షేమ సంఘ సభ్యులైన పందిరి రాము కి మంత్రివర్యులు అవంతి శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పౌర సంక్షేమ సంఘంప్రధాన కార్యదర్శి తాతపూడి ప్రదీప్ కుమార్ భీమిలి నియోజకవర్గం మంత్రివర్యులైన అవంతి శ్రీనివాస్, పౌర సంక్షేమ సంఘ సమస్యలపై పలుమార్లు మార్లు వినతిపత్రం ఇచ్చామని చెప్పి ఆయనకు వివరించడంజరిగినది ఈ కార్యక్రమంలో 

బెల్లపు పాపారావు గారు N. బాబ్జి జగన్మోహన్ రావు, పంటాకుల శ్రీనివాస్, అప్పన్న ఆషా స్వరూప్ కాకి నాగేశ్వరరావు, డాక్టర్ బి.ఎన్ రావు, కావ్య రెడ్డి, కరీం, శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.