విద్యార్థులకు అండగా-- సునీల్ మహంతి

 విద్యార్థులకు అండగా 



ఎన్.ఐ.ఎఫ్.ఎస్. విద్యాసంస్థల అధినేత సునీల్ మహంతి.

 మధురవాడ-- (ప్రజాబలం న్యూస్)

చంద్రంపాలెం ఉన్నత పాఠశాలలో పదవ తరగతి ఉత్తీర్ణతలైన 12మంది బాస్కెట్ బాల్ పేదవిద్యార్థులకు చేయూత.  



  మధురవాడ: నేటి యువత విద్యా,క్రీడలు వంటి వాటిలో తమ నైపుణ్యత చాటి జీవితంలో ఉన్నతశిఖరాలను అధిరోహించాలని ఎందరో విద్యార్ధులు కలలుకంటూ ఉంటారు.అయితే వాటిని సాకారం చేసుకునే విషయంలో కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వారి ఆశయాల సాధనలో విఫలం అవుతుంటారు. ప్రతిభావంతుల్ని గుర్తించి వారికి బాసటగా నిలుస్తున్నవారుమన సమాజంలో లేకపోలేదు. అలాంటి ఉన్నత మనస్సు కలిగిన వారిలో ఒకరు విశాఖ జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు, ఎన్.ఐ.ఎఫ్.ఎస్ సి.ఈ.ఓ. సునీల్ మహంతి. ప్రతి సంవత్సరం ఈయన వలన ఎందరో విద్యార్థులు తమ చదువును ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగిస్తున్నారు.బాస్కెట్ బాల్ క్రీడలో ఆసక్తి కనబరుస్తున్న కొందరు క్రీడాకారులను సైతం ఈయన తన ఆర్థిక సహకారంతో చదివిస్తున్నారు.అందులో భాగంగానే బుధవారం మధురవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి ఉత్తీర్ణతలైన పేదవిద్యార్థులకు విశాలాక్షినగర్ బి.వి.కె కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యకోసం 12మంది విద్యార్థులకు తన ఆర్థిక సహకారంతో వారి ఫీజులను చెక్కుల రూపంలో ద్వారకానగర్ బి.వి.కె.కళాశాల ప్రిన్సిపాల్ జోగిరాజు, కస్పాండెంట్ శ్రీధర్ కు అందచేశారు.ఈకార్యక్రమంలో జిల్లా బాస్కెట్-బాల్ అసోసియేషన్ సెక్రటరీ భూషణరావు తదితరులు పాల్గొన్నారు.