ఎంవిపి కాలనీలో ఫిలిం స్టూడియో ప్రారంభం ---

 తక్కువ బడ్జెట్ తోసినిమా నిర్మాణ స్టూడియో ప్రారంభం 


 మధురవాడ (ప్రజాబలం న్యూస్ )

నగరానికి చెందిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ విశాఖ ట్రావెల్ అండ్ టూరిజం ఫౌండేషన్ వారి నిర్వహణలో డిజిటల్ వీడియోస్ సమర్పణలో ప్రపంచ యోగ, సంగీత దినోత్సవం సందర్భంగా బుధవారంస్థానిక ఎంవీపీ కాలనీ లో ఉన్న అడ్మిన్ ఆఫీస్ లో " ఫిలిం స్టూడియో " ను ప్రముఖుల సమక్షం లో అంగరంగ వైభవంగా ప్రారంభం చేసారు. ఈ సందర్బంగా ప్రముఖ దర్శకుడు జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ మణి భూషణ్ గారు మాట్లాడుతూ విశాఖపట్నం ఎంతో అభివృద్ధి చెందుతున్న నగరం , సినీ కళాకారులకు నిలయం , ఎంతోమంది ఔత్సాహిక సినీరంగ నిపుణులు ఉన్న సిటీ , ప్రపంచం లో పర్యాటకంగా ఎంతో ఉన్నతస్థాయి పొంది , సహజ అందాలతో ఎంతో మంది సినీ దిగ్గజాల చిత్రాలకు వేదిక అయ్యింది. ఇలాంటి తరుణం లో తక్కువ బడ్జెట్ లో సినిమా నిర్మాణం చేసేందుకు కావలసిన అత్యంత ఆధునిక కెమెరా , ఎడిటింగ్ , డబ్బింగ్ , ప్రీ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంత ఒకే చోట అందుబాటులో ఉంచారు ఇది ఒక సింగిల్ విండో ఫర్ సినిమా అనేలా రూపకల్పన చేసారు. చిన్న చిత్రాలు , ఓటిటి , యూట్యూబ్ కంటెంట్ , షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీ ఫిలిమ్స్ , ఇన్స్టిట్యూషనల్ ఫిలింస్, యాడ్ ఫిలిమ్స్, టెంపుల్స్ ఫిలిమ్స్ , ఇతర కంటెంట్ డెవలప్మెంట్ , ఏవిధమైన ఫిలిమ్స్ చెయ్యాలన్న అతి తక్కువ పెట్టుబడి తో అవకాశం ఏర్పరిచారు. ఫిలిమ్స్ లో నటించాలి అనుకునే నూతన నటీనటులకు , కెమెరామ్యాన్స్ కు, ఫిలిం టెక్నాలజీ ఎడిటింగ్ కొరకు యువతీ యువకులకు, ఏ వయసు వారైనా ఈ ఉచిత ట్రైనింగ్ ను పొందవచ్చు దీనికోసం 9848418582 ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. ముఖ్య అథితిదులు ఎంవీపీ బ్యాంకు అఫ్ బరోడా మేనేజర్, నరవ ప్రకాశరావు , రామేశ్వరి అక్క, సన్ మూర్తి , డాక్టర్ ప్రవీణ్ కుమార్ చేతులమీదుగా " షిర్డీ చూస్తా " - షిరిడి యాత్ర చిత్రానికి సంబందించిన టైటిల్ ఆవిష్కరణ ఎంతో వైభవంగా జరిగింది అతిదులందరు డైరెక్టర్ మణి భూషణ్ కు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమం లో సీఈఓ సీత రామ స్వామి , ఎడిటర్ నీరజ , హీరో ఆదిత్య భూషణ్ , లావణ్య , వైష్ణవి , మహేష్, నిర్మల్ భాను , అక్కు నాయుడు , విజయ రమణి నటీనటులు శ్రేయోభిలాషులు హాజరయ్యారు. 



,