మిథి లాపురి ఉడా కాలనీ సమస్యలు పరిష్కారం చేయండి--- ఎమ్మెల్యే అవంతి కి వినతిపత్రం అంద చేసిన కాలనీవాసులు

 మధురవాడ --


(ప్రజాబలం న్యూస్) -- 8 వ వార్డు పరిధి మిథిలాపురి ఉ డ కాలనీ పార్కులో ఆ ఏరియా వాసులతో మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు ఆదివారం ఉదయం  సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కాలనీవాసులు రోడ్లు కాలువలు పునర్నిర్మానం చేయాలని, పేరుకుపోయిన చెత్తను శుభ్రపరచాలని,వీధిలైట్లు సక్రమంగా వెలగలేదని, వ మౌలిక సదుపాయాలు కల్పించి కాలనీ అభివృద్ధి చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. వెంటనే అవంతి సమస్యలు పరిష్కారం చేసే విధంగా తగిన ప్రణాళిక రూపొందించాలని జోన్ 2 కమిషనర్k. కనకమహాలక్ష్మి కి ,సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. . ఈ సందర్భంగా అవంతికి సంఘం నేతలు సాలువా కప్పి సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో , 8 వవార్డు వైసీపీ సీనియర్ నేత లొడగల రామ్మోహన్ రావు, ఎంవి రమణమూర్తి, మహిళ నేత జ్యోతిర్మయి, 7వ వార్డు వైసిపి అధ్యక్షుడు పో తిన శ్రీనివాసరావు, సంఘం నేతలు రత్నాకర్,చంటి, కార్పొరేటర్ పోతిన హనుమంతురావు,తదితరులు పాల్గొన్నారు.