మధురవాడ ఎస్ ఆర్ ఓ కార్యాలయంలో ఈ స్టాంప్ సర్వీసులు ప్రారంభం.
మధురవాడ--- ఎక్స్ప్రెస్ న్యూస్ ---
బుధవారం నుండి మధురవాడ ఎస్ ఆర్ ఓ కార్యాలయం ఆవరణలో ఈ స్టాంప్ కౌంటర్ ప్రారంభించినట్లు ఎస్ ఆర్ ఓ రిజిస్ట్రిర్ అధికారులు మోహన్ రావు, వెంకయ్యనాయుడు తెలిపారు.
మధురవాడ మిదిలాపురి కాలనీ ఎస్ ఆర్ ఓ పరిధిలో సి ఎస్ సి మీసేవ సెంటర్ ఆపరేటర్ సిరిపురపు శ్రీహరి ఈ స్టాంప్ ఆపరేటర్ గా సర్వీసులు ప్రారంభించారు. మధురవాడ ఎస్ ఆర్ ఓ మోహనరావు చేతులమీదుగా మొదటి ఈ స్టాంంపుని వినియోగదారునికి అందిస్తూ సర్వీసులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎస్ ఆర్ ఓ రిజిస్ట్రిర్ అధికారి మోహన్ రావు, వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం వినియోగం లో ఉన్న స్టాంప్ లు ఉన్నంతవరకు ఉపయోగించుకుని ఇక అందుబాటులోకి డిజిటల్ ఇండియా లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ స్టాంపు లను ప్రారంభించారని పూర్తిగా ఈ స్టాంపులను వినియోగించుకోవాలని తెలిపారు.మొదటి రోజు బుధవారం 12 స్టాంపులు అమ్మకాలు జరిగాయని తెలిపారు. ఈ సౌకర్యాన్ని స్టాంపు వినియోగదారులు వినియోగించుకోవాలని సూచించారు.ఈ స్టాంప్ లు 10 రూపాయలనుండి వినియోగదారులకు అవసరమైన రెండు లక్షల రూపాయలు వరకు లభిస్తాయని, మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఈ స్టాంప్ కౌంటర్ ఉదయం 10 గంటలనుండి సాయంత్రం 5గంటలవరకు అందుబాటులో ఉంటుంది అని మధురవాడ ఎస్ ఆర్ ఓ పరిధిలో స్టాంప్ వినియోగదారులు ఈ స్టాంపులు అన్నివిధాలా రిజిస్ట్రేషన్ మరియు నాన్ రిజిస్ట్రేషన్ సర్వీసులకు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ ఓ అధికారులు మోహనరావు, వెంకయ్యనాయుడు,సీనియర్ అసిస్టెంట్ శేఖర్, సి ఎస్ సి మీసేవ సెంటర్ ఆపరేటర్ శ్రీహరి పాల్గొన్నారు.