షిరిడి సాయి మందిరంలో భారీ. అన్న సమారాధన o-- బాబా పల్లకిపై ఊరేగింపు.

 మధురవాడ


- -- (ప్రజాబలం న్యూస్ ) మధురవాడ 7వ వార్డు కళానగర్ షిరిడి సాయిబాబా ఆలయంలో గురువారం ఈ ఏడాదిలో ప్రధమ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా కళానగర్ షిరిడి సాయిబాబా మందిరం లో శిరిడి సాయిబాబా పాదయాత్ర జరిగింది. సాయి భక్తులందరూ వచ్చి దర్శనం లో పాల్గొన్నారు, నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీ శిరిడి సాయి పాదయాత్ర శ్రీ షిరిడి సాయిబాబా సేవ కొమ్మాది ఆశ్రమం నుండి సాయి నగర్ కందివలస ఆశ్రమం వరకు నాలుగు రోజులు 68 కిలోమీటర్ల శ్రీ శిరిడి సాయి బాబా పాదయాత్ర నిర్వహించబడుతుందని షిరిడి సాయిబాబా సేవ ఆశ్రయం ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త నాగోతి అప్పలరాజు ఆలయ కమిటీ అధ్యక్షులు నాగోవతి రాము, టీ ఎన్ టి యు సి.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతి శివాజీ, ఇల్లిపిల్లి బాబులు, రామారావు తదితరులు పాల్గొన్నారు.