భీమిలి నియోజకవర్గం -మధురవాడ -- ప్రజా బలం న్యూస్ - --జాతీయ రహదారి నుండి నగరంపాలెం మీదగా రహదారి పూర్తి చెయ్యడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు కావాలో ప్రజలకు చెప్పాలని స్థానిక శాసన సభ్యులు మాజీ మంత్రిగారైన ముత్తంశెట్టి శ్రీనివాసరావు ని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు ప్రశ్నించారు.
సిపిఐ మధురవాడ ఏరియా సమితి సమావేశం స్థానిక పార్టీ కార్యాలయంలో ఎం డి బేగం అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ సందర్భంగా పైడిరాజు మాట్లాడుతూ 4వేలు పైన ఉన్న చంద్రంపాలెం ఉన్నత పాఠశాల విద్యార్థులు జాతీయ రహదారి దాటడం కష్టంగా ఉందని పై వంతెన నిర్మించి సహాయ పడండి అని ప్రజలు విజ్ఞప్తి చేస్తే రహదారి మధ్యలో ఇనుప కంచె వేసి ఉన్న రహదారి మూసివేశారని ఇది అన్యాయం అని రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని చేస్తే కష్టం కాదని ప్రజలు విజ్ఞప్తి చేసినట్లే శాసనసభ్యుడు జాతీయ రహదారి అధికారులకు వినతి పత్రం ఇస్తే సమస్య పరిష్కారం అవుతుందా అని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆ సమస్య పరిష్కారం చెయ్యడానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున కృషి చెయ్యాలని కోరారు.
ఆగస్టు 16 నుండి సిపిఐ బస్ యాత్ర
"రాష్ట్రాన్ని రక్షించండి దేశాన్ని కాపాడండి" అనే నినాదంతో ఆగస్టు 16 నుండి సెప్టెంబర్ 6 వ తేదీ వరకు సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలలో బస్ యాత్ర నిర్వహిస్తున్నామని 16 వ తేది ఉదయం 10 గంటలకు విశాఖ కూర్మన్నపాలెం ప్రధాన ద్వారం వద్ద నుండి బస్ యాత్ర ప్రారంభం అవుతుందని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చెయ్యాలని కోరారు.
ఎం డి బేగం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏరియా పార్టీ కార్యదర్శి వి సత్యనారాయణ, జి వేళంగినిరావు, కె కుమార్, బి కేశవయ్య, జి మోహనరావు, కె నారాయణరావు తదితరులు పాల్గొన్నా
రు.