దిగ్విజయంగా కొనసాగుతున్న లోకేష్ పాదయాత్ర.---- 5, 7 వార్డుల కార్పొరేటర్లు లోకేష్ యువ గళం పాదయాత్రకు సంఘీభావం.,

 లోకేష్ యువ గ


ళం కి బ్రహ్మరథం--- 5వ వార్డ్ కార్పొరేటర్ హేమలత. మధురవాడ--- ప్రజాబలం న్యూస్ ---- తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పేరుతో చేపడుతున్న పాదయాత్రకు ప్రజల్లో విశేషమైన స్పందన లభిస్తుందని 5వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ మొ ళ్లీ హేమలత పేర్కొన్నారు. సోమవారం అద్దంకి నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్రకు సంఘీభావం ఆమె తండ్రి లక్ష్మణరావు తో పాటు భర్త రమణ, 7వ వార్డు పిల్లా మంగమ్మ, ఆమె భర్త వెంకటరావు పాల్గొన్నారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 170 వా రోజుకు చేరుకున్న ఈ సుదీర్ఘమైన పాదయాత్రకు అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రజలు హారతులు పడుతున్నారని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని, పేర్కొన్నారు. 2250 కిలోమీటర్ల కు చేరుకున్న ఈ పాదయాత్ర లో ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని ఎండ గడుతూ దిగ్విజయంగా సాగుతోందని, కాబోయే ముఖ్యమంత్రి గా నారాచంద్రబాబు నాయుడు మళ్లీ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిలో పెడతాడని పేర్కొన్నారు.