" సెల్ఫీ కాంటెస్ట్ " అప్పన్న గిరి ప్రదక్షిణ వేడుక
మధురవాడ (ప్రజాబలం న్యూస్ )
నగరానికి చెందిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ విశాఖ ట్రావెల్ అండ్ టూరిజం ఫౌండేషన్ వారి నిర్వహణలో డిజిటల్ వీడియోస్ సమర్పణలో గురు పౌర్ణమి సందర్బంగా ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ ఉత్సవం జులై తేదీ 2 న ఎంతో వైభవంగా జరగబోతుంది, ఈ సందర్బంగా స్థానిక ఎంవీపీ కాలనీ లో ఉన్న టీవీ టూరిజం అడ్మిన్ ఆఫీస్ లో "సెల్ఫీ కాంటెస్ట్ " పోస్టర్ ను ప్రముఖ దర్శకుడు జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ మణి భూషణ్ గారు మరియు హీరో ఆదిత్యభూషణ్ విడుదల చేసారు . ఈ సందర్బంగా డాక్టర్ మణి భూషణ్ మాట్లాడుతూ భారత దేశం లోనే సింహాచలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, సింహాచలం కొండ కూర్చున్న సింహం లా ఉంటుంది , ఈ క్షేత్రం లో జరిగే అతిపెద్ద ఉత్సవం నిజరూపదర్శనం తరువాత గిరి ప్రదక్షిణ సింహాచలం కొండ చుట్టూ భక్తులు అప్పన్న నామస్మరణా తో అంత్యంత భక్తి శ్రద్దలతో కాలినడకన ఉపవాసం తో గిరి ప్రదక్షిణ చేసి అప్పన్న దివ్య దర్శనం తో అస్సిసులు పొంది ఎనలేని ఆనందాన్ని పారవశ్యాన్ని పొందుతున్నారు. మరి అలంటి సమయం లో , మారుతున్నా కాలం తో పటు వినూత్న కార్యక్రమాన్ని ఈ వేడుక అందరికి తెలిసేలా సోషల్ మీడియా ద్వారా అవగాహనా పర్చేందుకు టీవీ టూరిజం ఛానల్ నడుంబిగించి సరిక్రొత్తగా గిరిప్రదక్షిణ సమయం లో అద్భుతమైన డిజిటల్ చిత్రాలను సేకరించే దిశగా భక్తుల భాగస్వామ్యం తో సెల్ఫీ కాంటెస్ట్ ను ప్రారంభించింది . ఈ కాంటెస్ట్ లో ఎవరైనా పాల్గొనవచ్చు , వారి ఫోన్ తో తీసిన అందమైన ఫోటోలను , సెల్ఫీలను , వీడియోలను 9848418582 నెంబర్ కు పంపడం ద్వారా ఈ పోటీ లో పాల్గొనే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఉత్తమ మైన ఫోటోలకు బహుమతి ప్రదానం కూడావుంది , పాల్గొన్న ప్రతిఒక్కరికి సర్టిఫికెట్ కూడా వుంది . అందరు ఈ కార్యక్రమం లో పాల్గొని సింహాద్రి అప్పన్న అస్సిసులు పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో సీఈఓ సీత రామ స్వామి , ఎడిటర్ నీరజ , హీరో ఆదిత్య భూషణ్ , లావణ్య హాజరయ్యారు.
ఇట్లు
విశాఖ ట్రావెల్ అండ్ టూరిజం ఫౌండేషన్,
డిజిటల్ వీడియోస్ & టీవీ టూరిజం.
9848418582
విశాఖపట్నం.