జగనన్న సురక్షతో సమస్యలు పరిష్కారం

 100 శాతం సమస్యల పరిష్కార దిశగా ''జగనన్న సురక్ష''--- మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యేఅవంతి శ్రీనివాస్ 

 మధురవాడ---(ప్రజాబలం న్యూస్ )

భీమిలి నియోజకవర్గం - జీవియంసి మదురవాడ జోన్ 2 8వ వార్డు- పరిధి సాగర్ నగర్ - రుషికొండ లలో మంగళ వారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు.



  జోన్ టు కమిషనర్ కే కనకమహాలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అవంతి మాట్లాడుతూ 


   "జగనన్న సురక్ష "

 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకమునుపు ప్రజలకు ఏదైతే వాగ్దానాలు కేవలం రెండు పేజీల ద్వారా తెలియపరచి.. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో సుమారు 99% హామీలను కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, రాజకీయాలు చేయకుండా ఆఖరికి పార్టీలు కూడా చూడకుండా లంచాలకు తావు లేకుండా ప్రజలకు అందించిన ఘనతఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు. , ఇంకామిగిలినవి సమస్యలు కూడా పరిశీలించి పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఈ జగనన్న సురక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలు ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాలంటీర్లు వాటిని నమోదు చేసుకుని సంబంధిత అధికారులు దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్యలకు పరిష్కార మార్గం చూపడం జరుగుతుందని చెప్పారు.

అంతేకాక రాష్ట్ర ముఖ్య మంత్రి

 వినూత్న పాలన ఆలోచన విధానం లో ఎటువంటి రుసుము లేకుండా పూర్తి ఉచితంగా ఈ జగనన్న సురక్ష కార్యక్రమ ఏర్పాటు హర్షించదగ్గ విషయం అని, దీని వలన ప్రతీ ఒక్కరికీ నేరుగా అక్కడి కక్కడే సత్వర పరిష్కారం జరుగుతుందని కొన్ని సందర్భాలలో సర్వర్ స్లోగా ఉన్న కారణంగా ఆలస్యమైనా సరే ఎవరూ ఎలాంటి అపోహలకు గురికావాల్సిన పని లేదని వారికి కూడా త్వరితగతిన అందజేయడం జరుగుతుంది అని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే సంబంధిత వాలంటీర్ల ద్వారా అధికారుల దృష్టికి తీసుకువచ్చి సమస్యలను పరిష్కరింప చేసుకోవచ్చని ఇంతటి గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.


 అనంతరం


 అవంతి చేతులు మీదుగా లభ్థిదారులకు సర్టిఫికెట్ లు అందజేశారు.


ఈ కార్యక్రమంలో జీవియంసి కమిషనర్ వర్మ - జోనల్ కమిషనర్ కనక మహాలక్ష్మి, ప్రభుత్వ అధికారులు వార్డు నాయకులు - సచివాలయం కన్వినర్ లు గృహ సారథులు కార్యకర్తలు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.