మధురవాడ--- ప్రజాబలం న్యూస్ --
జీ వి ఎం సి 6వ వార్డు కే 2 కాలని లో ఉచిత వైద్య శిభిరం మంగళవారం నిర్వహించారు.రోటరీ క్లబ్, వైజాగ్ డిమాండ్స్ సమ్యుక్తంగా ఈ శిభిరం నిర్వహించారు.ఈ శిభిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది.సుమారుగా 100 మంది కి వైద్యం చేసి,మందులు పంపిణీ చేశారు.పిల్లల వైద్య నిపుణులు,స్త్రీల వైద్య నిపుణులు అయిన డాక్టర్లు కే వి రాజారమేష్,మౌనిక చే వైద్యం అందించారు.ఈ సందర్భంగా ముందుగా రోటరీ క్లబ్ అధ్యక్షులు శశి జైశ్వవాల్ మాట్లాడుతూ పేదలకు మా సంస్థ ద్వారా సేవలు అందించేందుకు కృషి చేస్తున్న ట్లు తెలియ జేశారు.వైద్య సేవలే కాకుండా,విపత్తుల కాలం లోనూ సహాయం చేయడానికి కృషి చేస్తున్నామని తెలియ జేశారు.ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు జీ రాంబాబు,ఎస్ కామేశ్వరరావు,కే నగేష్ కుమార్,విఠల్ ప్రసాద్.వి సి సి కార్యకర్త లు డి కొం డమ్మ,డి శైలు,సీఐటీయూ నాయకులు పి రాజు కుమార్,కే వెంకట అప్పారావు, డి అప్పలరాజు.పద్మ పైడి రాజు తదితరులు పాల్గొన్నారు.