అసాంఘిక శక్తులను హెచ్చరించిన పీఎం పాలెం సిఐ రామకృష్ణ.

 మధురవాడ--- (ప్రజాబలం న్యూస్) జివీఎంసీ 7వ వార్డు పర్ది వాంబే కాలనీలో పీఎం పాలెం పోలీసులు ఏ రామకృష్ణ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. ఎటువంటి అసాంఘిక కార్య క్రమాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టారు. . నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిపై కూడా ఆరా తీశారు. వారి కదలికలను పోలీసులు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారు. ఇదే సందర్భంలో రికార్డులు లేని 12 వాహనాలను సీజ్ చేశారు. ఇటీవల రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ వాలంటీర్లు పై చేసిన వాఖ్యలు కారణంగా వాంబే కాలనీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. వాంబేలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. ఇరువైపుల నుండి ఒకరినొకరు రెచ్చగొట్టుకోకుండా ముందుచూపుతో ఈ కవాతు నిర్వహించడం పట్ల స్థానికంగా హర్షం వ్యక్తం అవుతుంది. ఈ సందర్భంగా అసాంఘిక కార్యక్రమాలకుపాల్పడిన, శాంతి బాధితులకు విఘాతం కలిగించిన చట్టరీత్యా తగిన చర్యలు తీసుకుంటామని పీఎం పాలెం సిఐ రామకృష్ణ హెచ్చరించారు.