ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైసిపి ప్రభుత్వం -- మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్

 మధురవాడ---


ప్రజాబలం న్యూస్ --- జీవీఎంసీ 5వ వార్డు పరిధిలో శివశక్తి నగర్ ఏరియాలో మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు సోమవారం సాయంత్రం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో పాల్గొన్నారు. 5వ వార్డు వైసీపీ అధ్యక్షుడు మాజీ కార్పొరేటర్ పోతిన హనుమంతరావు ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం విజయవంతంగానే సాగుతుందని ఆ పార్టీ కార్యకర్తలు అభిమానులు హుషారుగా ఉన్నారు. ఈ సందర్భంగా అవంతి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారి గుమ్మం దగ్గరకే తీసుకెళ్లి అందజేసిన ఘనత ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఈ సందర్భంగా కొనియాడారు. సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు ఇంతవరకు ప్రభుత్వం అందజేసిన సహాయాన్ని వారికి బ్రోచర్ల ద్వారా తెలియజేశారు. వారి నుండే ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, సచివాలయ సిబ్బంది, కన్వీనర్లు, గృహ సారథులు పాల్గొన్నారు.