మత్తు పదార్థాలు నిషేధిద్దాం -- యువత భవిష్యత్తు కాపాడుకుందాం.-- విశాఖ నగర సిపి త్రివిక్రవర్మ

 మత్తు పదార్థాలను నిర్మూలిద్దం - యువత భవిష్యత్తును కాపాడుకుందాం:సిటీ పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ 

 మధురవాడ--- ప్రజా బలం న్యూస్ -



మత్తు పదార్థాలను నిర్మూలిద్దం - యువత భవిష్యత్తును కాపాడుకుందాం అనే నినాదంతో విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ ఆధ్వర్యంలో జీవీఎంసీ జోన్ పరిధిలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్లో కొమ్మది గాయత్రి కాలేజ్ ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుతున్న 

 సుమారు 3000  మంది విద్యార్థులకు అవగాహన కార్యక్రమం మంగళవారంనిర్వహించారు..ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ డా.సి.ఎమ్. త్రివిక్రమ వర్మ, మాట్లాడుతూ విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరముగా ఉండాలని, మాదక ద్రవ్యాలు వాడినా, కలిగి ఉన్నా, సరఫరా చేసినా, అమ్మినా ఎన్ డి పి ఎస్ చట్టం ద్వారా అత్యంత కఠిన శిక్షలు పడతాయాని, ఎటువంటి శిక్షలు పడతాయో స్వయంగా వివరించారు, మత్తుకు బానిసై పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, నేరాలకు పాల్పడి చికిత్స పొందుతున్న పలువురు కోసం తెలిపి తమ అమూల్యమైన జీవితాన్ని డ్రగ్స్ బారిన పడి నాశనం చేసుకోవద్దని హితబోధ చేశారు., యాన్టి-డ్రగ్స్ పై అవగాహాన యువతకి కల్పించే ఉద్ధేశంతో కళాశాలకు రావడం జరిగిందని అన్నారు.. మాదక ద్రవ్యాలు వాడటము వలన ఆరోగ్యం పాడవంతో పాటు, కుటుంబ సభ్యులతో ప్రేమసంబందాలు తగ్గిపోతాయని, ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. . ముఖ్యంగా యువత డ్రగ్స్ దూరంగా ఉంటూ మంచి భవిష్యత్తుకు బాటల వేసుకోవాలని సూచించారు. విద్యార్ధులు అడిగిన సందేహలను నివృత్తి చేస్తూ చట్టాలపైన అవగాహాన కల్పించారు.                 

               ఈ కార్యక్రమం నందు చివరిగా Anti drug & ganja campaign ప్రతిజ్ఞ చేశారు, అనంతరం కార్యక్రమ ఉద్దేశ్యం తెలుసుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నగర పోలీసులకు, కాలేజీ యాజమాన్యానికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు.

               మాదక ద్రవ్యాలపై ఎటువంటి సమాచారం తెలియజేయాలన్నా, ఫిర్యాదుల కొరకు 14500 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి తెలియపరచవచ్చు.*

ఈ కార్యక్రమంలో డి.సి.పి -01(ఎల్&ఓ) విద్యా సాగర్ నాయిడు,ఐ.పి.ఎస్. ప్రొఫసర్ & హెచ్ ఓ డి అఫ్ సైకాలజీ, చైర్మన్ ఫాకల్టీ అఫ్ సైన్స్ ,ప్రిన్సిపాల్ ఇన్ చార్జ్ అఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆంధ్ర యూనివర్సిటీ, డా.ఎమ్.వి.ఆర్.రాజు , ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ ఎడ్యుకేషన్స్ కౌన్సిలర్, చైర్ పర్సన్ అఫ్ గ్రీన్ వాలీ ఫౌండేషన్, ఉమా రాజ్ , హెచ్ ఓ డి, కేర్ అఫ్ మెంటల్ హెల్త్, కే.వి.రామిరెడ్డి

 , చైర్మన్ అఫ్ గాయత్రి విద్యాపరిషత్ , డా పి.సోమరాజు,

 సి.ఈ.ఒ ద్రోణ కన్సల్టెన్సీ సురేష్ బెతా, పియం పాలెం పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..