గరికిపాటికి సహస్రావధాన ఉపన్యాస చక్రవర్తి బిరుదు

 సహస్రావధాన ఉపన్యాస చక్రవర్తి. బిరుదు ప్రధానం.


 మధురవాడ--- ప్రజాబలం న్యూస్--

 విశాఖ క్షత్రియ కళ్యాణ మండపం సీతమ్మధారలో తెలుగువారు గర్వించ దగ్గ మహోన్నత వ్యక్తి,తెలుగు రచయిత,అవధాని, ఉపన్యాసకులు, సహస్రావధాని,అష్ట,శత, ద్విశత ఇంకా ఎన్నో అవధానాలు చేసి ఎందరికో మార్గ దర్శకులయ్యి,తన ఉపన్యాసాలతో ఎందరికో మేలుకొలుపు తెస్తున్న బ్రహ్మశ్రీ గరికపాటి నర్సింహారావు కు *సహస్రావధాన ఉపన్యాస చక్రవర్తి,అని బిరుదును ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అర్చక మరియు పురోహిత సంక్షేమ సంఘం రాష్ట్రకార్యదర్శి అధికార్ల కాళిదాసు ఆధ్వర్యంలో ప్రధానం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా శాఖ కమిటి సభ్యులు జిల్లాఅధ్యక్షలు అంబటిపూడి సుధీర్ కుమార్ శర్మ. ఉపాధ్యక్షులు నేరేల్ల కామేశ్వర శర్మ,చామర్తి కేశవాచార్యులు, కమిటి సభ్యులుముడియా నరసింహముర్తి,లింగంపల్లి కామేశ్వరరావు,కోశాధికారి మురపాక అనిల్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.