మధురవాడ---- ప్రజాబ
లం న్యూస్ --- జీవీఎంసీ 7వ వార్డు పరిధి వాంబే కాలనీలో గత కొన్నేళ్లుగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న మురళి అనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లీడర్ పప్పు చీటీలు, నెలవారిల్ చీటీలు తన పలుకుబడిన ఉపయోగించి అందరిని నమ్మబలికి భారీ స్థాయిలో చీటీలు వ్యాపారం చేశాడు. ఉన్నట్లుండి ఏమైందో ఏమో కోట్లాది రూపాయలు జనాలకు కొంగ నామాలు పెట్టి కుటుంబంతో సహా. పరారైపోయాడు. చీటీలు వేయించడం, ఆ చీటీలు పాడిన వారి దగ్గర మళ్లీ అప్పు తీసుకోవడం ఇలా కోట్ల రూపాయల టర్నో వారు చేస్తూ ఈ ఐదేళ్ల కాలంలోనే వాంబే కాలనీ మురళిగా పేరు తెచ్చుకున్నాడు. ఒక వెలుగు వెలిగిన ఇతను పరారై పోవడం పట్ల బాధితులు గొగ్గోలు పెడుతున్నారు. కక్కలేక మింగలేక అతను తిరిగి వస్తాడేమో అని ఎదురుచూస్తున్నారు. అనధికారంగా నిర్వహించే ఈ చీటీలు వ్యాపారం చేసే వాళ్ళు ఇప్పటికే అనేక మార్లు మోసగించి పరారైన సంఘటన అనేకం ఉన్నాయి. అయినప్పటికీ కూడా అనధికార చీటీలు ప్రతి ఏరియాలోను వీధికొకటి వేస్తున్నారు. ఇటువంటి సంఘటన లు ఎన్ని జరుగుతున్న పట్టించుకోవడంలేదు. ఇటువంటి వారిపై కేసులు పెట్టడం తప్ప బాధితులకు న్యాయం జరగడం లేదు. పోలీస్ కేసులు కన్నా ఎంతోకంత వసూలు చేసుకోవడమే మేలని కొంతమంది బాధితులువెనకడుగు వేస్తున్నారు.