చెత్త పన్ను రద్దు చేయాలి, విద్యుత్ చార్జీలు తగ్గించాలి --- సిపిఎం డిమాండ్

 చెత్తపన్ను రధ్దుతో పాటు విపరీతంగా పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలి..సీపీఎం.



 మధురవాడ (ప్రజాబలం న్యూస్ )

చెత్త పన్నులు రద్దు చేయాలని ప్రజలు అనేక రూపాల్లో విన్నవించినా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం లెక్క చేయకుండా బలవంతపు వసూళ్లు చేయడం దుర్మార్గమని సీపీఎం మధురవాడ జోన్ కమిటీ కార్యదర్శి డి అప్పలరాజు అన్నారు.అంతే కాకుండా చెత్త వసూళ్ల కోసం ప్రజలను సంక్షేమ పథకాలు నిలిపి వేస్తామని బెదిరించడం,వార్డు సచివాలయం ఉద్యోగులను భయపెట్టడం తో పాటు ఉద్యోగాల నుండి తొలగిస్తామని హెచ్చరికలు జారీచేయడం కొంతమంది ని సస్పెండ్ చేయడం ప్రభుత్వం నిరంకుశ విధానాలకు నిదర్శనమని అన్నారు.ముఖ్యమంత్రి ఇటువంటివి అరికట్టవలసిన అవసరం వుందని అన్నారు.చెత్త పన్నులు రద్దు,పెంచిన కరెంటు చార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జీ వి ఎం సి 5 వార్డు 67 వ సచివాలయం వద్ద ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్ల కార్డులు ప్రదర్శిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.కేంద్రం బీజేపీ ప్రభుత్వం,రాష్ట్రంలో వై యస్ ఆర్ సి పి ప్రభుత్వం ప్రజలకు సరైన ఉపాధి కల్పించక పోగా తీవ్రమైన ఆర్ధిక భారాలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.కరెంటు చార్జీలు పెంచడం వలన సామాన్య ప్రజలు తెచ్చుకున్న కాస్త ఆదాయం లో సగం కరెంటు బిల్లుకే సరిపోతుందని తెలియ జేశారు.మిగిలినది వంట గ్యాస్ కు సరిపోతుందని అన్నారు.ఇంకా ప్రజలు ఏమీ తిని బ్రతకాలని ప్రశ్నించారు.

ప్రజలను అధుకునే చర్యలు,ఉపాధి కల్పన కు చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రజలను,ఉద్యోగులను భయపెట్టడం బెదిరించడం మానుకోవాలని హితవు పలికారు.లేకుంటే ప్రజల ఆగ్రహానికి గురి కాక తప్పదని హెచ్చరించారు.ధర్నా అనంతరం సచివాలయం 

కు వినతి పత్రం సమర్పించారు.ముఖ్యమంత్రి గారికి తమరి ద్వారా తెలియ చేయాలని కోరారు.ఈ కార్యక్రమం సీపీఎం నాయకులు డి కొండమ్మ,కే సుజాత,డీ తులసి,ఎం కనాకరత్నం,కే పుష్ప,ఎం నారాయణమ్మ, తదితరులు పాల్గొన్నారు.