మధురవాడ--
- ప్రజాబలం న్యూస్ --- భీమిలి ఆర్డిఓ భాస్కర్ రెడ్డి మంగళవారం ఏర్పాటు చేసిన ఓటరు వెరిఫికేషన్ పై గత వారం రోజులు గా జరిగిన పనితీరుపై సమీక్ష నిర్వహించారు.ఈవిధంగా ప్రతి మంగళవారం ఈ సమావేశం జరుగుతుందని దీనిలో భాగంగా సమీక్ష ఉంటుందని ఆర్డిఓ తెలియజేశారు. ఈ సమీక్ష సమావేశంలో పలు పార్టీ నేతలు పాల్గొన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండిమధురవాడకు చెందిన ఆరో వార్డు వైసిపి అధ్యక్షుడు బి. అప్పలరాజు, కోలా చంద్రశేఖర్,భీమిలి నియోజకవర్గం జనసేన నేత ఇఎన్ఎస్ చంద్ర రావు, 8 వ వార్డు జనసేన అధ్యక్షుడు శేఖర్ శ్రీను,తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆరో వార్డు లో పీఎం పాలెం లో పలు పార్టీలకు చెందిన నాయకులు, బిఎల్వోలు కలసి ఇంటింటికి తిరిగి ఓటర్ లిస్టు పరిశీలన చేసి ఓటర్ల చేర్పులు తో పాటు., దొంగ ఓట్లు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించారు.ఈ కార్యక్రమంలో 6 వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, జనసేన నేత ఈ ఎన్ఎస్ చందర్రావు,తదితరులు పాల్గొన్నారు.