జన సైనికుల కు అండ -- పరుచూరి

 జన


సైనికులకు ఆపదలో అండగా-- పరుచూరి మధురవాడ (ప్రజాబలం న్యూస్ )----జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావు అనకాపల్లి మండలం రేబాక గ్రామ జనసైనికుడు కోన శేషు ఉద్యోగరీత్యా పోలాండ్ దేశంలో పని చేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందడంతో అయన ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం పాపయ్యపాలెం గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన జనసైనికుడు అప్పికొండ అనిల్ ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం పాపయ్యసంతపాలెం గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన జనసైనికుడు కోటపాటి అప్పారావు ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్బంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారి కుమారుడికి అవసరమైన వైద్యం తన సొంత ఖర్చులతో చేయిస్తాను అని భాస్కరరావు హామీ ఇచ్చారు. అనంతరం అనకాపల్లి పట్టణం 82వ వార్డు కి చెందిన జనసేన నాయకులు యాలకుల ధర్మ, సత్య తండ్రి ఇటీవల మరణించడంతో వారి ఇంటికి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మూలపేట గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడిన జనసైనికులు ఆలం శంకర్ నక్కరాజు గణేష్ నివాసాలకు వెళ్లి పరామర్శించారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.