క్రీడలు అన్ని రంగాలలో పోటీ తత్వానికి దోహదపడతాయి --- టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి

 ఉత్సాహంగా 10వ వైయస్సార్ కప్-2023 బాక్సింగ్ పోటీలు. 

 మధురవాడ (ప్రజాబలం న్యూస్)

ముఖ్యఅతిథిగా హాజరైన టీటీడీ చైర్మన్,ఉత్తరాంధ్ర వైయస్సార్సీపి కన్వీనర్ వై.వి.సుబ్బారెడ్డి.



  విశాఖ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ పర్యవేక్షణలో మారుతి బాక్సింగ్ క్లబ్ ఆధ్వర్యంలో 10వ వై ఎస్ ఆర్ కప్ -2023 జిల్లా స్థాయి సీనియర్స్ మేన్&ఉమెన్ బాక్సింగ్ పోటీలు రెండవ రోజైన శనివారం ఉత్సాహంగా జరిగాయి. యువ బాక్సర్ల పిడు గుద్దులతో చంద్రంపాలెం ఉన్నత పాఠశాల ఆవరణం హోరెత్తింది.ముందుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఉత్తరాంధ్ర వైయస్సార్సీపి కన్వీనర్ వై.వి.సుబ్బారెడ్డి.

 పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.రెండవ రోజు పోటీలకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న వైవి యువ బాక్సర్ లను అభినందించారు.పోటీల నిర్వహకుడు వంకాయల మారుతి ప్రసాద్ క్రీడలు, రాజకీయ, స్థానికంగా చేపడుతున్న స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను సుబ్బారెడ్డి ఈ సందర్భంగా ప్రశంసించారు. క్రీడల వలన శారీరక దృఢత్వంతో పాటు మానసిక పరివర్తన వస్తుందని,రాష్ట్రస్థాయి జాతీయస్థాయి గుర్తింపుతో పాటు మంచి భవిష్యత్తు చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.విద్యార్థి దశ నుంచే ఆటల పట్ల ఆసక్తిని పెంపొందించుకొని, నైపుణ్యంతో క్రీడల్లో రాణించాలన్నారు.రెండవ రోజు రోజు 40బౌట్లు జరగగా 80మంది బాక్సర్లు తలబడ్డారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఎలక్ట్రానిక్& ఐటి ఏజెన్సీస్ జనరల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, 

నగరాల కార్పొరేషన్ చైర్ పర్సన్ పిల్లాసుజాత సత్యనారాయణ,జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు దల్లి రామకృష్ణారెడ్డి,ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐ,వెంకటేశ్వరరావు, ప్రముఖ కళాకారులు ఉప్పాడ అప్పారావు,డి.తిరుపతి నాయుడు,బాక్సింగ్ అసోసియేషన్ సభ్యులు దండు నాగేశ్వరరావు,కే నూకరాజు,ఐ సాయిప్రసాద్,టైక్వాండో రాష్ట్ర ఉపాధ్యక్షులు బసనబోయిన ఆనందరావు,వైకాపా నాయకులు అల్లాడ వెంకట్రావు,పెండ్డ్రి అప్పన్న,5వ వార్డ్ ఎస్టి సెల్ అధ్యక్షులు జీలకర్ర గణేష్, జగ్గుపిల్లినరేష్,బంగారు ప్రకాష్,పసుపులేటి గోపి,బంక అప్పారావు, సింహాచలం ట్రస్ట్ బోర్డ్ సభ్యురాలు ముదిండి రాజేశ్వరి, బయ్యవరపు రాధా,కొర్రాయి సురేష్, చైల్డ్ వెల్ఫేర్ మెంబర్ మాధవి వర్మ తదితరులు పాల్గొన్నారు.