పంచముఖ ఆంజనేయస్వామి కి ప్రత్యేక పూజలు.
మధురవాడ ---
ప్రజా బలం న్యూస్
శ్రీ శోభకృత్ నామ సంవత్సర అధిక శ్రావణ మాసం శుక్ల పక్షం సప్తమి మంగళవారం ఉదయం మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో క్షేత్ర పాలకుడిగా ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి వారికి పంచామృత సుగంధ జలాభిషేకం జరిపించి అనంతరం అలంకరణ చేసి సింధూరార్చన, నాగవళ్ళీ దళార్చన, పుష్పార్చన తదితర పూజా లు ఆలయ అర్చకులు పట్నాల రాంబాబు శర్మ, హరి స్వామి జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.