జగనన్న ఇల్లు నిర్మాణ పనులు పరిశీలించిన జనసేన నేతలు.--- భీమిలి ఇంచార్జ్ పంచ కర్ల--- ఉత్తర ఇంచార్జ్ ఉషా కిరణ్

 జగనన్న ఇల్లు


లబ్ధిదారులకు ఆర్థిక భారం.

 మధురవాడ ----ప్రజాబలం న్యూస్ --

జనసేన పార్టీ భీమిలి నియోజకవర్గంలో ఆనందపురంమండలం తంగుడుబిల్లి గ్రామంలో జగనన్న కాలనీ ఇల్లు నిర్మాణ పనులు పరిశీలించారు. ప్రజలకు, ప్రభుత్వాలకు తెలియజేసే విధంగా భీమిలి జనసేనపార్టీ ఇంచార్జ్ సందీప్ పంచకర్ల, ఉత్తర నియోజకవర్గం ఇంచార్జ్ పసుపులేటి ఉష కిరణ్ లు . జగనన్న లేవుట్ లను శనివారం పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ పేదలు పేరుతో ఏర్పాటు చేసిన లేవుట్ లో తీవ్ర అన్యాయం చేస్తున్నారని న్నారు. ఆ లేవుట్ లో కనీస మోలిక వసుతులు లేకుండా ఇల్లు నిర్మాణం చేపడుతున్నారని రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రమాదం జరిగితే ఎవ్వరు బాధ్యతలు ని నిలదీశారు. మౌలిక సదుపాయాలు కల్పించకుండా లోతట్టు లలో నిర్మించడం వల్ల లబ్ధిదారులకు భారంగా ఉంటుందని పేర్కొన్నారు.తంగుడు బిల్లీ లేవుట్ లో బెస్మెంట్ నిర్మాణం లో నాణ్యత లోపం తో ఇల్లు నిర్మాణం చేపట్టి మధ్యలో వదిలేసి అభిద్దిదారులు ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జగనన్న లేవుట్ లను పరిశీలించి హేష్ ట్యాగ్ ద్వారా వివరిస్తునట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో చంద్రరావు, బి. వి. కృష్ణయ్య, శాఖరి శీను బాబు, రాజు నవిరి, కిరణ్ గుడివాడ, శ్రీకాంత్, శంకర్, సత్యనారాయణ, సాగర్, దుక్క వెంకంట్, మూర్తి, సంతోష్, నానాజీ, సంతోష్ నాయుడు, సతీష్, జనసైనికులు పాల్గొన్నారు.