- అవంతి వ్యూ
హాలు ఫలించేనా? జడివానలో గడపగడపకు మన ప్రభుత్వం ----మధురవాడ --- (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ ) మధురవాడ జోన్ టు 7వ వార్డు పరిధి వాంబే కాలనీలో 65వ సచివాలయం పరిధిలో గల ఈ,బి, హెచ్, ఎఫ్, ఐ, బ్లాక్ లలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సోమవారం సాయంత్రం భీమిలి ఎమ్మెల్యే ము త్తం శెట్టి శ్రీనివాసరావు జడివానలో పర్యటించారు. కుండ పోత వర్షంలో తమ కార్యకర్తలు నాయకులను వెంటబెట్టుకొని,సచివాలయ సిబ్బంది గడపగడపకు వెళ్లి లబ్ధిదారుల కు అందిన సంక్షేమ పథకాలు వారికి మళ్లీ మళ్లీ గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని,వచ్చే ఎన్నికల్లో మరిన్ని సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తామని అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా ముఖ్యమంత్రి పని చేస్తున్నారని అవంతి జనాలకు వివరిస్తూ వారి చేత చప్పట్లు కొట్టిస్తూ తన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నారు. పట్టు వీడని విక్రమార్కుడిలా తాను భీమిలి నుండే మళ్లీ పోటీ చేస్తానని తనను మళ్లీ అందరూ ఆశీర్వదించాలని ఎన్నికల ప్రచారాన్ని తలపించే విధంగా, తాను ఓట్లు కోసం రాలేదని చెబుతూనే, వారిని ఓట్లు అభ్యర్థిస్తూ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి ప్రజల్లోకి తీసుకెళ్తూ ఆయన తన ప్రత్యేకతను చాటు కుంటున్నారు. కార్యకర్తలను నాయకులను వాలంటీర్లే ఆయనకు అండగా వారిని పొగుడు కుంటూ తన ప్రచారాన్ని ముందుకు దూసుకుపోతున్నారు. ప్రధానంగా మధురవాడలో తన పట్టును సాధించుకునేందుకు పడుతున్న పాట్లు ఇన్ని అన్నీ కావు. ప్రతిపక్షాల నాయకులను సైతం తన వలలో వేసుకునేందుకు ఆయన చేస్తున్న వ్యూహాలు ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఈయన కష్టం ఎంతవరకు ఫలిస్తుందో అని ఆయన అభిమానులు కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. భీమిలి నియోజకవర్గం లో అవంతికి సరైన పోటీ ఎవరు లేరని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విశాఖ జిల్లాలో ఆయనే పెద్ద దిక్కు అని, కాపు సామాజిక వర్గంలో పెద్ద నేతగా ఎదగడం చూసి ఓర్వలేక అతనిపై దుష్ప్రసాదం చేస్తున్నారన్నా ఆరోపణలు సర్వత్రా వెళ్లి వెత్తుతున్నప్పటికీ, వాటిని తిప్పికొట్టేందుకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా దాన్ని అవకాశం గా భావించి ప్రజల్లోకి వెళ్ళడం ఆయన కష్టపడి తిరగడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.అయితేఈ నియోజకవర్గంలో అవంతిని ఢీకొట్టే నాయకుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తప్ప ఇక్కడ వేరొక నాయకుడు ఉండబోడనే ప్రచారం జోరుగా సాగుతోంది. వీరిద్దరి మధ్య పోటీ జరిగితే పోటీ రసవత్తరంగా ఉంటుందని రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.వీరిద్దరూ కులాలకు పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా పని చేసే నాయకులు కావడంతో బలమైన కాపు సామాజిక వర్గం చెందిన వారు కావడంతో విశాఖలో రాజకీయంరస వత్తరం గా ఉంటుందని స్థానికంగా చర్చ జరుగుతోంది. అయితే వీరిద్దరికీ భీమిలిలో పోటీ చేసే అవకాశం వస్తుందా రాదా అనేది కాలమే నిర్ణయిస్తుంది..