ఆధ్యాత్మిక సేవలోనే ఆత్మసంతృప్తి హజరత్ ముక్తియార్ ఆలీ ఆశ్రమం ట్రస్ట్ చైర్మన్ ఎండి అహ్మద్

అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపైనా ఉండాలి. - ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి. శ్రీ విజయ దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకున్న హజరత్ ముక్తియార్ అలీ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎం.డి అహ్మద్. విశాఖపట్నం - (ప్రజా బలం న్యూస్ ఆన్లైన్ సీనియర్ జర్నలిస్ట్ మానo శ్రీను మధురవాడ ) ఉరుకులు పరుగుల జీవనంలో ఒత్తిడికి గురవుతున్న ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాల్సిన అవసరం ఉందని హజరత్ ముక్తియార్ అలీ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎం.డి అహ్మద్అన్నారు..మధురవాడ టైలర్స్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ విజయ దుర్గాదేవి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవములను పురస్కరించుకొని శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో కొలువుతీరిన అమ్మవారిని శనివారం సాయంత్రం ఆయన దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్తలు బంగారు సుబ్బారావు,బంగారు లక్ష్మీ దంపతులు మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ శర్మ అమ్మవారి తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు అందజేసి ఎం.డి అహ్మద్ ను శాలువతో సన్మానించారు.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా అమ్మవారి శరన్నవరాత్రుల మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ అందరిని ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపిస్తున్న విజయ దుర్గాదేవి ఆలయ ధర్మకర్తల సేవలు గొప్పవన్నారు. లోక కళ్యాణార్డం అమ్మవారి మహోత్సవాలను ఎంతో చక్కగా నిర్వహిస్తున్న బంగారు కుటుంబీకులను కొనియాడారు . అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపైనా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్త మండల సభ్యులు,బంగారు ప్రకాశ్, బంగారు అశోక్ కుమార్, బంగారు ఝాన్సీ ,తెంటు మాధవి, వట్టికుల నాగమ్మ తదితరులు పాల్గొన్నారు