ఘనంగాముగిసిన దసరా నవరాత్రి మహోత్సవాలు.. రాజ రాజేశ్వరి అవతారంలో కొలువైన దుర్గమ్మ. ప్రత్యేక పూజలు చేసిన సిఐ వెంకట్రావు
October 13, 2024
శ్రీ విజయ దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకున్న మాడుగుల సీఐ వెంకట్రావు.
విశాఖపట్నం -(భీమిలి నియోజకవర్గం, ప్రజా బలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను ) అక్టోబర్ మధురవాడ టైలర్స్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ విజయ దుర్గాదేవి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవములను పురస్కరించుకొని శనివారం రాత్రి శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో కొలువుతీరిన అమ్మవారిని మాడుగుల సీఐ సీహెచ్ వెంకట్రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ శర్మ అమ్మవారి తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు అందజేసి శాలువతో సన్మానించారు.. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు బంగారు సుబ్బారావు,బంగారు లక్ష్మీ ధర్మకర్త మండల సభ్యులు బంగారు ప్రకాశ్ , బంగారు అశోక్ కుమార్ , ఝాన్సీ,తెంటు మాధవి , అడ్వకేట్ గుడివాడ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.