విశాఖ సిటీ అపోలో హాస్పిటల్ లో'"' అపోలో చెస్ట్ పెయిన్ క్లినిక్ ప్రారంభించిన హోం మంత్రి వంగలపూడి అనిత.

హోం మంత్రి వంగలపూడి అనిత చేతుల మీదుగా 'అపోలో చెస్ట్ పెయిన్ క్లినిక్' ప్రారంభం - విశాఖపట్నం సిటీ (ప్రజా బలం న్యూస్ ఆన్లైన్, సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను పాత మధురవాడ ) - - విశాఖపట్నం - హెల్త్ సిటీలో.. - 24/7 అందుబాటులో రోగులకు సేవలు విశాఖపట్నం, అక్టోబర్ 2024: యువతలో పెరుగుతున్న ఆకస్మిక గుండె మరణాలను ఎదుర్కొనేందుకు అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో సోమవారం విశాఖపట్నంలో గల హెల్త్ సిటీలో ఏర్పాటు చేసిన 'అపోలో చెస్ట్ పెయిన్ క్లినిక్'ను‌ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కష్ట సమయాలలో రోగులకు సహాయం చేసే వైద్యుల సేవలు ప్రశంసనీయం అన్నారు. గుండె జబ్బులు వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు.. మనకు మొదట గుర్తుకు వచ్చే పేరు 'అపోలో' అన్నారు. రోగులకు సులభంగా స్నేహ పూర్వకంగా వైద్యం అందించడంలో తన కర్తవ్యాన్ని కొనసాగిస్తూ.. ఇప్పుడు ఛెస్ట్ పెయిన్ క్లినిక్ ప్రారంభించిందని తెలిపారు. ఛాతి నొప్పితో బాధపడే ఎవరికైనా ఇది తక్షణ సహాయం అందిస్తుందన్నారు. ఆ నొప్పి గుండెకు సంబంధించినదైతే తక్షణమే చికిత్స అందుతుందన్నారు. ఆ నొప్పి గుండెకు సంబంధించినది కాకపోతే, అపోలో ఆసుపత్రులు ఎలాంటి చార్జీలు వసూలు చేయవన్నారు. గుండె నొప్పి, ఇతర కారణాల వల్ల కలిగే నొప్పి మధ్య తేడాను తెలుసుకోవడం కష్టమేనన్నారు. ఒకప్పుడు గుండె సమస్యలు వృద్ధుల సమస్యగా ఉండేవన్నారు. జీవనశైలిలో మార్పులు, కోవిడ్-19 తర్వత యువతలో అధికంగా కనిపిస్తున్నాయని చెప్పారు. ఈ సమస్యను ప్రారంభ దశలో గుర్తించడం, చికిత్స అవసరమన్నారు. అయితే, చాలా మంది హాస్పిటల్ ఖర్చులకు భయపడి వైద్యం తీసుకోవడానికి ఆలస్యం చేస్తున్నారన్నారు. ఇది ప్రాణాంతకం కావచ్చన్నారు. నొప్పిపై సందేహం ఉన్న వారికి ఈ క్లినిక్ తక్షణ వైద్య పరీక్షలు అందించే అవకాశాన్ని కల్పిస్తుందన్నారు. ఇది గుండె సమస్యకు తక్షణ చికిత్స అందించడమే కాకుండా, ఆ నొప్పి గుండెకు సంబంధించినది కాకపోతే ఆరోగ్యం పట్ల మనశ్శాంతిని కూడా ఇస్తుందన్నారు. గుండె జబ్బులు విస్తృతంగా పెరుగుతున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల వారి కోసం అపోలో హాస్పిటల్స్ గుండె ఆరోగ్యంపై వీడియోలు, ఇతర సమాచారాన్ని రూపొందించాలని కోరారు. గుండె జబ్బు లక్షణాలు, నివారణ చిట్కాలు, వ్యాయామాలు, జీవనశైలిలో మార్పులపై అవగాహన పెంచాలన్నారు. ఇది సమాజంలో అధిక మంది తమ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్స్ రీజినల్ సీఈవో వై సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ చాతి నొప్పి క్లినిక్ సేవలు అపోలో హాస్పిటల్ రామనగర్, హెల్త్ సిటీలో గల అపోలో హాస్పిటల్లో అందుబాటులో కలవన్నారు. చాతి నొప్పి లక్షణాలు కనిపిస్తే సమీప క్లినిక్‌ను సంప్రదించవచ్చన్నారు.. ఈ ప్రత్యేకమైన క్లినిక్‌లు ఛాతీ నొప్పికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఏర్పాటు చేశామన్నారు. గుండెపోటు లక్షణాలు ఎదుర్కొంటున్న రోగులకు నిత్యం అందుబాటులో ఉంటుందన్నారు. రోగులకు తగిన సంరక్షణ అందిస్తారన్నారు.‌ త్వరగా వైద్య సహాయం అందుతుందన్నారు. ఎటువంటి ఖర్చు లేకుండా నిపుణుల నుంచి భరోసా పొందుతారన్నారు. విజిట్ సమయంలో ఆర్థిక భారం ఉంటుందనే భయం లేకుండా.. గుండె సంరక్షణను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యమన్నారు. ‌ గుండె సంబంధిత నొప్పిని త్వరగా గుర్తించి కార్డియాక్ మరణాలను నివారించడానికి ఈ క్లినిక్‌లను ప్రారంభించామన్నారు. జీవితాలను కాపాడే యుద్ధంలో ప్రతిక్షణం విలువైనదన్నారు. ఈ క్లినిక్‌లలో అర్హత కలిగిన ఎమర్జెన్సీ వైద్యులు (ఈఆర్) పని చేస్తారన్నారు. 24/7 కార్డియాలజిస్టు సేవలు అందుబాటులో కలవన్నారు. అపోలో హాస్పిటల్స్‌లో పూర్తిగా సన్నద్ధమైన ఏసీఎల్ఎస్ అంబులెన్సులు, శిక్షణ పొందిన వైద్య, పారామెడికల్ సిబ్బంది కలరన్నారు. అత్యవసర రోగుల కోసం పది కిలోమీటర్ల పరిధిలో పికప్ సర్వీసులు ఉచితంగా అందించనున్నామని చెప్పారు. ‌ 'అపోలో చెస్ట్ పెయిన్ క్లినిక్' హాస్పిటల్స్ రెండూ రోగులకు అవసరమైన సేవలు అందించేందుకు అత్యాధునిక సాంకేతికత, మౌలిక సదుపాయాలు కలిగి ఉన్నాయన్నారు. నిర్ణీత వ్యవధిలో గుండెపోటు రోగులకు చికిత్స చేసేందుకు 24 గంటలూ నిపుణులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఛాతీ నొప్పితో బాధపడుతున్న ప్రతి రోగి.. నొప్పి గుండె సంబంధించినదా? ఇతర కారణాల వల్లా? అనేది నిర్ధారించడానికి అత్యవసర బృందం ద్వారా పరీక్షలు చేయబడుతాయని చెప్పారు. రోగి ఈసీజీ, ట్రోప్ I చేయించుకుంటారని తెలిపారు. కార్డియాలజిస్ట్ నొప్పికి కారణాన్ని నిర్ధారిస్తారన్నారు. ఆ నొప్పిని గుండెపోటుగా సూచిస్తే.. ప్రామాణిక మార్గదర్శకాలు, ప్రోటోకాల్‌ ప్రకారం తగిన చికిత్స చేయబడుతుందని‌ చెప్పారు. ఈ చికిత్సలో మెడికల్ మేనేజ్మెంట, ఆంజియో, ప్రైమరీ యాంజియోప్లాస్టీ అవసరాన్ని బట్టి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్స్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ డీకే బారుహ్ మాట్లాడుతూ వైజాగ్‌లో అపోలో హాస్పిటల్ ప్రారంభించినప్పుడు ఈ ప్రాంతంలో కార్డియాక్ కేర్ ఇంకా ప్రారంభ దశలోనే ఉందన్నారు. ఈ విషయంలో మార్గదర్శకులుగా ఉన్నందుకు గర్విస్తున్నామని తెలిపారు. కోస్తా‌ ఆంధ్రాలో మొట్టమొదటి యాంజియోప్లాస్టీ చేశామన్నారు. ఆ తర్వాత ప్రపంచంలోని అత్యుత్తమ ప్రమాణాలతో అధునాతన విధానాలను పరిచయం చేశామని తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణను అందించాలన్న మా నిబద్ధతను మరింత బలంగా ముందుకు తీసుకు వెళ్తున్నామని చెప్పారు. ఈ క్లినిక్ ద్వారా గుండె జబ్బులు గుర్తింపు, అత్యవసర చికిత్సలో ఆలస్యం వల్ల జరిగే ప్రాణ నష్టాన్ని నివారించాలన్నది మా లక్ష్యమన్నారు. గుండె ఆరోగ్యానికి సంబంధించి సమయం చాలా కీలకం అన్నారు. కొద్ది సేపు ఆలస్యం అయినా అది మృత్యువుకు దారి తీస్తుందన్నారు. ఈ ప్రయత్నం ద్వారా లక్షణాలు ప్రారంభమైన తర్వాత సరైన సంరక్షణ పొందడంలో జరిగే ప్రమాదకర ఆలస్యాన్ని నివారించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. తక్షణ వైద్య పరీక్షలు, చికిత్స అందించడం ద్వారా ప్రాణాలను కాపాడనున్నామని‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్ సీనియర్ డాక్టర్ ఎన్కే పాణిగ్రాహి, డాక్టర్ శశాంక చుండూరి, డాక్టర్ చక్రదర్ పెడాడ, డాక్టర్ రవికాంత్ టి. కార్డియోథొరాసిక్ సర్జన్లు డాక్టర్ జేకే త్రివేది, డాక్టర్ ఎల్ విజయ్, డాక్టర్ మెడికల్ సూపరింటెండెంట్ బాలకృష్ణ, సీఓఓ రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. అపోలో హాస్పిటల్స్, విశాఖపట్నం గురించి విశాఖపట్నంలో 1999లో స్పెషాలిటీ హార్ట్ కేర్, కిడ్నీ కేర్ హాస్పిటల్ సేవలను అపోలో హాస్పిటల్స్ ప్రారంభించింది. అప్పటి నుంచి ఈ ప్రాంతంలోని ఆరోగ్య సంరక్షణలో ముందుంది. విశాఖపట్నాన్ని భారతదేశ ఆరోగ్య సంరక్షణ మ్యాప్‌లో ఉంచింది. అప్పట్లో ఇది కోస్తా ఆంధ్రలో ఈ రకమైన మొదటి సౌకర్యం. ఈ హాస్పిటల్లో ప్రపంచంలోని అత్యంత అధునాతన సౌకర్యాలు, అనేక వైద్య ప్రత్యేకతలు, సూపర్ స్పెషాలిటీలలో ప్రముఖ కన్సల్టెంట్‌లు ఉన్నారు. డిజిటల్ కార్డియాక్ కాథెటరైజేషన్ ల్యాబ్‌ను కలిగి ఉన్న కోస్తా ఆంధ్రలో మొదటి హాస్పిటల్ ఇది. ఈ ప్రాంతంలో యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్, సీఏబీజీ, టోటల్ ఆర్టీరియల్ రివాస్కులరైజేషన్, ఆధునిక స్థిరీకరణ పద్ధతులను ఉపయోగించి బీటింగ్ హార్ట్ సర్జరీ, కాంప్లెక్స్ పుట్టుకతో వచ్చే గుండె శస్త్రచికిత్సలు, మినిమల్లీ ఇన్వాసివ్ కార్డియాక్ సర్జరీలు వంటి అనేక విధానాలు, శస్త్రచికిత్సలకు మార్గదర్శకంగా నిలిచింది. కోస్తా ఆంధ్రలో అత్యధిక సంఖ్యలో డయాలసిస్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లను నిర్వహించే రికార్డును ఈ. హాస్పిటల్ కలిగి ఉంది. 1999-2000లో‌ సీఏజీ/పీటీసీఏ/సీఏబీజీ/ పీడియాట్రిక్ హార్ట్ సర్జరీ చేయడంలో మొదటి హాస్పిటల్. మరింత సమాచారానికి దయచేసి సంప్రదించండి : 9963980259/ 9959154371