కూటమి ప్రభుత్వము తోఆరో వార్డు అభివృద్ధి. స్మశాన వాటిక క్లీనింగ్.

భీమిలి నియోజకవర్గం,మధురవాడ (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్. సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను ) ఆరో వార్డు పీఎం పాలెం హిందూ స్మశాన వాటిక సమస్య గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చిన కనీస స్పందన లేదు అదే విషయం స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు దృష్టికి వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దాసరి శ్రీనివాస్ తీసుకుని వెళ్లిన వెంటనే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. స్మశానంలోకి కనీసం నడిచి వెళ్లడానికి కూడా వీలు లేకుండా దట్టమైన చెట్లు తుప్పలు పెరిగిపోయి ఉండడం కనీసం వాటర్ సౌకర్యం లేకపోవడం తదితరు విషయాలు మీద చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించడం జరిగింది జీవీఎంసీ అధికారులు నిన్నటి నుంచి జెసిబిమిషన్తో తుప్పల తొలగించే కార్యక్రమం మొదలైంది వార్డులో వీధిలైట్లు సమస్య తీవ్రంగా ఉండడాన్ని వార్డు అధ్యక్షులు దాసరి శ్రీనివాస్ జీవీఎంసీ జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా ప్రస్తుతం స్టాక్ లేదు రాగానే పనులు మొదలుపెడదాం అని చెప్పడం జరిగింది ఈ విషయాన్ని మాలతాంబ విద్యాసంస్థల అధినేత సునీల్ మహంతి గారి తో చర్చించి మీ సంస్థ ద్వారా కొన్ని లైట్లు ప్రొవైడ్ చేయవలసిందిగా కోరడం జరిగింది. మహంతి స్పందించి 30 వీధిలైట్లు వాటికి కావలసిన సామగ్రి సంస్థ ద్వారా అందించారు.వార్డు అధ్యక్షులు దాసరి శ్రీనివాస్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సాంకేతిక ఇంజనీరింగ్ కాలేజ్ వరకు వాటిని అమర్చడం జరిగింది త్వరలోనే వార్డులో అన్ని ప్రాంతాలకు వీధిలైట్లు పాడైపోయిన రోడ్డు మరమ్మత్తులు డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి పనుల మీద స్థానిక శాసనసభ్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు ఆదేశాలతో వార్డులో ఉన్న సమస్యలను అధికారులు దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది (దాసరి శ్రీనివాస్ ఆరో వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు)