మధురవాడ మరో మాదాపూర్ --- మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా.

అభివృద్ధి బాటలో భీమిలి నియోజకవర్గం, మధురవాడను మరో గచ్చిబౌలిలా తీర్చిదిద్దుతా -- మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా. భీమిలి నియోజకవర్గం, (మధురవాడ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను ) జీవీఎంసీ 6 వ వార్డులో రూ. 66.45 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు, సీసీ రోడ్డు, సీసీ డ్రెయిన్, కల్వర్టు, సామాజిక భవనం ప్రహరీ గోడ నిర్మాణానికి మంగళవారం కొమ్మాది కళ్యాణ మండపం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమిలి నియోజకవర్గం అభివృద్ధిపై ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ అధ్యక్షతన ఈనెల 25 న సమావేశం నిర్వహిస్తున్నామని, జిల్లా అధికారులందరూ ఇందులో పాల్గొంటున్నారని తెలిపారు. ఒక అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధిపై ఇలాంటి సమావేశాన్ని నిర్వహించడం ఇదే తొలిసారి అన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గం మైన , భీమిలికి ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. మధురవాడ మరో గచ్చిబౌలి తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. జోనల్ స్థాయిలో కూడా సమీక్షలు నిర్వహించి, పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ఉద్యోగాల కోసం చదువుకున్న యువత వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా విశాఖలోనే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. తన హయంలో నిర్మాణం ప్రారంభించిన కళ్యాణ మండపాన్ని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని, సగం పూర్తయిన దీన్ని రూ.80 లక్షల అంచనాతో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఏ అంచనాలతో తనను భారీ మెజారిటీతో గెలిపించారో,అభివృద్ధి చేసి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. అయిదేళ్లుగా ఎలాంటి అభివృద్ధి లేకుండా ఉన్న జీవీఎంసీ వార్డుల్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో6 వ వార్డు టీడీపీ అధ్యక్షుడు దాసరి శ్రీనివాసరావు , జోన్ 2 కమిషనర్ సింహాచలం నాయుడు, కూటమి నేతలు భీమిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కోరాడ రాజబాబు, ఆరో వార్డ్ జనసేన అధ్యక్షుడు సంతోష్ నాయుడు 8వ వార్డ్ జనసేన అధ్యక్షుడు శాఖరి శ్రీనివాసరావు, ఆరో వార్డు టిడిపి సీనియర్ నేత గొల్లంగి ఆనందబాబు. 5వ వార్డు టిడిపి సీనియర్ నేత మొల్లి లక్ష్మణరావు, సీనియర్ టిడిపి నేత వాండ్రాసి అప్పలరాజు, తదితరులు పాల్గొన్నారు.