ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ కరపత్రాలతో విస్తృత ప్రచారం.. జోరుగా సాగుతున్న ఇంటింటి ప్రచారం... ప్రజల నుండి విశేషమైన స్పందన.. మండిపోతున్న నిత్యవసర వస్తువుల ధరలు నియంత్రణ చేయాలని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజులుగా ప్రజల్లోకి వెళ్తున్న సిపిఐ. ప్రశాంతంగా అడుగులు ముందుకు వేస్తున్న సిపిఐ జిల్లా కార్యదర్శి పైడ్రాజు..

ఒకవైపు ప్రజలకు ఉచితంగా గ్యాస్ బండ ఇచ్చి - మరోవైపు విద్యుత్ చార్జీలు గుదిబండ మోపడం భరించలేని భారం- ఎర్రను ఎర వేసి సవడను తినేయడంలా ప్రభుత్వ వ్యవహార 0 -- సిపిఐ (భీమిలి నియోజకవర్గం మధురవాడ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను.) తక్షణమే పెంచిన విద్యుత్ చార్జీలు, నిత్యావసరాల ధరలు తగ్గించాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కరపత్రాలతో విస్తృత ప్రచారం మధురవాడలో చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆదివారం సిపిఐ ఆధ్వర్యంలో జీవీఎంసీ 7 వ వార్డు చంద్రంపాలెం, దుర్గా నగర్ లలో ఇంటి ఇంటికి కరపత్రాలు పంచే కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు పాల్గొని మాట్లాడుతూ చీకటి వెలుగుల రంగేళి... జీవితమే ఒక దీపావళి ! ఇది దీపావళి గురించి కవుల వర్ణన. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తీరు కూడా అలాగే ఉన్నట్టు అనిపిస్తోంది! ఈ దీపావళి నుండి ఉచితంగా గ్యాస్ బండలు పంపిణీ అని సామాన్య ప్రజలను ఊరిస్తూ, తాము సూపర్ సిక్స్ పథకాలను వరుసగా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నామని సంకేతాలు పంపడానికి ప్రభుత్వం ఆరాటపడుతోందని కానీ, ఇదే దీపావళి ఆనందం మాటను రాష్ట్ర ప్రజలకు కనపడని వసూళ్ల దెబ్బ కొట్టడానికి ప్రభుత్వం సిద్ధపడిందని విమర్చించారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని హామీలను గుప్పించిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కాకముందే విద్యుత్ ఛార్జీలను పెంచి వినియోగదారులపైన అదనపు ఆర్థిక భారాన్ని మోపడానికి సిద్ధపడిందన్నదని సుమారు 6072.86 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై రుద్దడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దారుణమని వినియోగదారులంతా గోల పెడుతున్నారన్నారు. ఈ ఛార్జీల పెంపుతో ప్రతి యూనిట్ పై గరిష్టంగా 1.58 రూపాయల అదనపు భారం పడనుందని, .ఈ నవంబరు నుండి 16 నెలల పాటు ఈ అదనపు ఛార్జీలను వసూలు చేస్తారని, ఇప్పటికే బియ్యం, పప్పులు, వంట నూనె ధరలు విపరీతంగా పెరిగాయని తక్షణమే విద్యుత్ చార్జీలు, నిత్యావాసరాల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎం మన్మధరావు, ఏరియా కార్యదర్శి వి సత్యనారాయణ, పి వి అప్పారావు, ఎన్ రాము, కె చిన్న, పి రమణ, ఎం అప్పలనాయుడు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.