నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలి,- సిపిఐ డిమాండ్. విస్తృత ప్రచారం చేస్తున్న మధురవాడ సిపిఐ.
October 18, 2024
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెరుగుతున్న నిత్యవసర వస్తువులు ధరలనునియంత్రణ చేయాలి.
భీమిలి నియోజకవర్గం,మధురవాడ:, (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్. సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను. విశాఖపట్నం పాతమధురవాడ)
మధురవాడ ఏరియా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కొమ్మాది సెంటర్ లోభవన నిర్మాణ కార్మికులు లేబర్ బజార్ వద్దకేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ నిత్యావసర వస్తువుల ధరలను, తగ్గించాలని కరపత్రాలు పంపిణీ చేశారు. శుక్రవారంసిపిఐ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ మూడవసారి అధికారం కొచ్చి నిత్యవసర వస్తువులు ధరలు పెంచి ప్రజలపై ప్రజలపై భారాలు మోపుతున్నారని, ఇసుక లేక ప్రజలు ఇబ్బందిపడుతున్నారని అన్నారు. భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడుతున్నారని ఈ టైంలో ధరల పెంచి ప్రజల పొట్టలు కొట్టొద్దని వెంటనే పెంచిన ధరలు తగ్గించాలనిసిపిఐ పార్టీ డిమాండ్ చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎంఏ బేగం అప్పలరాజు షేక్ మెషిన్ అప్పారావు రాంబాబు సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.