రాష్ట్రస్థాయ జిమ్నాస్టిక్ పోటీలకు ఎంపికైన లక్ష్మీనారాయణ. రేవెల్లపాలెం పిల్లా వారి ఇంట చిచ్చరపిడుగు.
October 15, 2024
భీమిలి నియోజకవర్గం,మధురవాడ--- (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను ) రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్ పోటీలకు ఆరో వార్డు పరిధి రేవెళ్ల పాలెం కు చెందిన పిల్లా లక్ష్మీనారాయణ ఎంపిక అయినట్లు బాలుడు తండ్రి ఫోటో స్టూడియో పిల్లా వాసుదేవరావు తెలిపారు. ఈనెల 17 నుండి 19వ తేదీ వరకు గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియం లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో తమ కుమారుడు పాల్గొంటారని తెలిపారు. విశాఖ జిల్లా జిమ్నాస్టిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే జిల్లాస్థాయి పోటీలలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడని తెలిపారు.