ఆకాశాన్ని అంటుతున్న నిత్యవసర వస్తువుల ధరలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అరికట్టాలి, - విశాఖ సిపిఐ డిమాండ్. ఇంటింట కరపత్రాలతో ప్రచారం.చేసిన విశాఖ సిపిఐ జిల్లా కార్యదర్శి మరుపల్లి పైడిరాజు.. అరికట్టాలి నిత్యవసర వస్తువులు ధరలను ,అరికట్టాలి అరికట్టాలి. ఏలే వాడికి బుద్దే లేదా చూసే వాడికి సిగ్గే లేదా.

సామాన్యులపై ధరల పిడుగు ! మండుతున్న నిత్యావసరాల ధరలు !! ధరల అదుపు బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే !!! - సిపిఐ భీమిలి నియోజకవర్గం,మధురవాడ,( ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను పాత మధురవాడ మెట్ట ) 5వ వార్డు పరిధి శివశక్తినగర్ లో ఇంటి ఇంటికి కరపత్రాలు పంచుతూ సిపిఐ విస్తృత ప్రచారం చేసింది. ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు... నాగులో నాగన్న ధరలట్లా మండిపోయే నాగులో నాగన్న అంటూ పాడుకోవడం తప్ప ఇపుడు మరో దిక్కు లేకుండా పోతున్నదని సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం మధురవాడ ఏరియా శివశక్తినగర్ లో ఇంటి ఇంటికి కరపత్రాలు పంచుతూ ప్రచార కార్యక్రమం ప్రారంభించినపైడిరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ మన దేశంలో నిత్యావసర వస్తువులు, కూరగాయలు ధరలు విపరీతంగా పెరిగాయి. మోదీ మూడోవ సారి అధికారంలోకి వచ్చిన తరువాత వ్యాపారస్తులు పండుగ చేసుకున్నారని, ధరలు నియంత్రణ చేసే నాదుడు బ్లాక్ మార్కెట్ విచ్చిల విడిగా చేసుకుంటున్నా అడిగే నాధుడు లేకుండా పోయారని, ఆగస్టు నెలలో 3.65 శాతంగా ఉన్న ద్రవ్యోల్భనం దసరా నాటికి 5.49 శాతానికి చేరుకున్నాదని, దేశవ్యాప్తంగా అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని సామాన్య జనం నోట్లోకి నాలుగువేళ్లూ పోవాలంటే గగనం అవుతున్నదని, ధరల భారం కోట్ల కుటుంబాలను పస్తులు పెడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎ కూరగాయలుఐనా కేజీ వంద అయ్యిందని, వంట నూనెలు సైతం భగ్గుమంటున్నాయి. పామాయిల్, సన్ ఫ్లవర్ నూనెలు లీటర్‌కు 20 రూపాయలకు పైగా పెరిగింది. వేరుశనగ నూనె 160 రూపాయలు దాటి.. డబుల్ సెంచరీని టచ్ చెయ్యబోతోంది. కొబ్బరి నూనెదీ అదే దారి. వంట నూనెలపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలు భారీగా పెంచడమే ఈ మంటకు కారణమట. బుక్కయ్యేది మాత్రం వినియోగదారుడే. ఆకుకూరలైతే ముట్టుకుంటే చాలు అగ్గి రాజుకుంటోంది. ఐదు వందల నోట్లు రెండు పట్టుకెళితే తప్ప కనీసం నాలుగైదు రకాల కూరగాయలతో చేతిలో సంచి నిండడం లేదని తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ధరలు అదుపు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యురాలు ఎం డి బేగం, ఏరియా కార్యదర్శి వి సత్యనారాయణ, ఎస్ కె సల్మా, బి కేశవయ్య, రవి, వెంకటేశ్వరరావు, ఎం అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.