చంద్రంపాలెం దుర్గాలమ్మ నవరాత్రి సంబరాలుముగింపు. పూర్ణాహుతి. జాతర గట్టు దుర్గాలమ్మ ఆలయ కమిటీ, అధ్యక్షుడు పిల్లా సూరిబాబు, కార్యదర్శి తాతారావు, ధర్మకర్త చంద్రశేఖర రావు
October 13, 2024
ఘనంగా చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు.
రాజరాజేశ్వరీ దేవిగా శ్రీ దుర్గాలమ్మ అమ్మవారు,
అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తజనం
(విశాఖపట్నం జిల్లా, భీమిలి నియోజకవర్గం, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను )
చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవములు ఘనంగా నిర్వహించారు,
శ్రీ క్రోధి నామ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ దశమి దసరా సందర్భంగా ముందుగా అమ్మవారి మూల విరాట్ కు పంచామృత సుగంధ ద్రవ్యాలు అభిషేకం, జలాభిషేకములు నిర్వహించారు శనివారం దుర్గమ్మ రాజరాజేశ్వరీ దేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చింది , అనంతరం అష్టోత్తర శతనామావళి కుంకుమ పూజ నిర్వహించి హోమం పూర్ణాహుతి అనంతరం కళశ ఉద్వాసన మొదలగు కార్యక్రమాలు ఆలయ అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ, మూర్తి శర్మ తదితరులు నిర్వహించారు,
విజయదశమి దసరా సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వందల సంఖ్యలో వాహనాలకు పూజలు నిర్వహించారు, వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు, ఆలయానికి విచ్చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేసి పర్యవేక్షించారు,
చంద్రంపాలెం వాస్తవ్యులు పోతిన వెంకటరమణ, రాజేశ్వరి దంపతులు పిళ్లా శ్రీనివాసరావు, అశ్విని దంపతులు సహకారంతో ఏర్పాటు చేసిన పులిహోర, కొమ్ము శనగలు ప్రసాదాలు అమ్మవారికి నివేదించి ఉదయం నుండి సాయంత్రం భక్తులకు పంపిణీ చేసారు,
ఈ కార్యక్రమంలో ప్రధాన కళశ స్థాపకులు బండి దుర్గా కిషోర్ కుమార్ శ్రీమతి శ్రీకృష్ణ కుమారి దంపతులు, ఆలయ ధర్మకర్త పిళ్లా చంద్రశేఖర్, ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు, ఉపాధ్యక్షులు
పి.వి.జి.అప్పారావు, పి.వి.జి.అప్పారావు, సెక్రటరీ నాగోతి తాతారావు, కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావు, ఉప కోశాధికారి దుక్క వరం, జాయింట్ సెక్రటరీ పిళ్లా మోహన్ శివకృష్ణ, సభ్యులు పిళ్లా వెంకటరమణ, పోతిన పైడిరాజు, గూడేల రాజు, పొట్నూరి హరికృష్ణ, బోగవిల్లి రాము , కేశనకుర్తి అప్పారావు, పిళ్లా రమణ, పిళ్లా రాజు, నాగోతి అప్పలరాజు, దుర్గాశి సోంబాబు, బంక వాసు, బైపిల్లి సురేష్, పిళ్లా శ్రీను,
చంద్రంపాలెం గ్రామ పెద్దలు పిళ్లా శ్రీనివాసరావు, సత్యన్నారాయణ, పీస రామారావు
ఆలయ ముఖ్య సభ్యులు పిళ్లా కృష్ణమూర్తి పాత్రుడు, పిళ్లా పోతరాజు, జగుపిల్లి అప్పారావు, పి.వి.రమణ మూర్తి, పిళ్లా వెంకటరమణ, పిళ్లా అప్పన్న, జగుపిల్లి నరేష్,పిళ్లా సూరి పాత్రుడు, యమ్.వెంకటరావు, జి.కామేశ్వరరావు, జగుపిల్లి శివ, పిళ్లా రాజు,
యస్.రమేష్, పిళ్లా నాగ, శ్రీను, అప్పారావు, పి.రాంబాబు, అమ్మవారి సేవకులు అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.