గీతం యూనివర్సిటీని సందర్శించిన కేంద్రమంత్రి జయంతి చౌదరి.
October 15, 2024
కేంద్ర నైపుణ్యాభివృద్ది మంత్రిజయంత్ చౌదరి గీతం సందర్శన
భీమిలి నియోజకవర్గం, (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ)
కేంద్ర ప్రభుత్వ స్కిల్ డవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ శాఖ మంత్రి జయంత్‌చౌదరి గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని మంగళవారం తేది:15`10`2024న సందర్శించారు. వైద్య రంగంలోని వారికి నైపుణ్యాలను పెంచడానికి గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చి (జిమ్‌సర్) వైద్య కళాశాల ఆవరణలో నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ది కేంద్రాన్ని, మూర్తి ప్రయోగశాలలను, మేకర్స్ స్పేస్, వెంచర్ డవలప్‌మెంట్ సెంటర్‌లను ఆయన మంగళవారం సందర్శించి విద్యార్ధులతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ భారతీయ యువతలో నైపుణ్యాలను వెలికి తీయడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోందని ముఖ్యంగా పరిశ్రమల అవసరాలకు, యువతలో నైపుణ్యాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పూరించడానికి ఎప్పటికప్పుడు గ్యాప్ స్టడి నిర్వహిస్తున్నామని తెలిపారు. సామాజిక శాస్త్రాలు అభ్యసించే యువతకు సహితం ఉపాధిఅవకాశాలు పెంచడానికి ప్రత్యేక ఇంటర్న్‌షిప్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. జాతీయ స్థాయిలో నైపుణ్యాలను ప్రోత్సహించడానికి స్కిల్ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గీతం అధ్యక్షుడు విశాఖ ఎంపీ .శ్రీభరత్ మాట్లాడుతూ బోధనతో పాటు పరిశోధనలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. యువ పరిశోధకులను ప్రోత్సహించడానికి మూర్తి రీసెర్చి గ్రాంట్ రూపంలో పరిశోధన నిధులను కేటాయిస్తున్నట్లు వెల్లడిరచారు. అలాగే విద్యార్ధులలో నైపుణ్యాభివృద్దికి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నామని సిలబస్‌లో అందుకు తగ్గ మార్పులు చేశామని, పరిశ్రమలతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నామని వెల్లడిరచారు. విద్యార్ధులలలో స్టార్టప్ సంస్కృతిని పెంచడానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహితం నైపుణ్యాల అభివృద్దికి ప్రత్యేక దృష్ఠిసారించిందని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో గీతం ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ ఎమ్.గంగాధరరావు, గీతం విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ వై.గౌతమ్‌రావు, జిమ్‌సర్ ప్రోవైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ బి.గీతాంజలి, జిమ్‌సర్ డీన్ డాక్టర్ ఎస్.పి.రావు, స్కూల్ ఆఫ్ సైన్స్ డీన్ ప్రొఫెసర్ కె.ఎస్.కృష్ణ, గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్ ప్రొఫెసర్ రాజా ఫణి పప్పు, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డీన్ విభూతి సత్యదేవ్, పలువురు డైరక్టర్‌లు, ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు.